మాక్సిమ్ గోర్కీ... రష్యాకు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత. ఆయన అసలు పేరు అలెక్సీ మాక్సిమోవిక్ పెష్కోవ్. మార్చి 28, 1868న రష్యాలోని నిజ్ని నోవోగార్డ్‌లో జన్మంచిన గోర్కీ.. తన తండ్రి పేరును కూడా కలుపుకుని 'మాక్సింగోర్కీ'గా ప్రాచుర్యంలోకి వచ్చాడు. సమాజం కోసం తమ జీవితాన్ని... రచనలను అంకితం చేసిన మహారచయిత మాక్సిమ్ గోర్కీ. ప్రపంచ సాహిత్యంలో కష్టజీవుల అభ్యున్నతికి అంకితమైన రచయితకు పర్యాయపదం గోర్కీ. ‘అమ్మ’ నవలతో ప్రపపంచ ప్రఖ్యాతిగాంచిన గోర్కీ.. అమెరికాలోని అడిరాన్ డాక్ పర్వతశ్రేణిలో ప్రవాస జీవితం గడుపుతూ... ‘అమ్మ’కు ప్రాణం పోశాడు గోర్కీ. విప్లవకారుడైన కొడుకు భావాల బాటలో నడుస్తూ ... సోషలిజాన్ని మతస్పూర్తితో కొనసాగించడం ‘అమ్మ’కు సహజం గానే అబ్బింది. ‘అమ్మ’తో ప్రపంచ ప్రసిద్ధమైన గోర్కీ మేధో ప్రస్తానం ‘అధోజనం’ ‘మధ్య తరగతులు’ అన్న ప్రసిద్ధ నాటకాల మీదుగా సాగి -‘అసందర్భ ఆలోచనలు (1918), కొత్త జీవితం (Navya Zhizn ,New Life)పత్రికలో కొనసాగి - ’ అర్టమోం వాణిజ్యం (1925) వరకూ విస్తరించింది. అమ్మ పలుమార్లు తెలుగులోకి అనువాదమయింది.
12ఏళ్ల
వయసులోనే ఎన్నో కష్టాలను అనుభవించాడు. కొంతకాలం చెప్పులు కుట్టే షాపులో
పనిచేశాడు. ఆ తర్వాత తాపీ పని చేశాడు. అందులోనూ గిట్టుబాటు కాకపోవడంతో ఒక
ఓడలో వంట కుర్రాడుగా చేరాడు. అక్కడ మూడేళ్లు పనిచేసి, అనంతరం ఒక రొట్టెల
దుకాణంలో చేరాడు. ఇలా ఎన్నిరకాల పనులు చేసినా పొట్ట గడవకపోవడంతో 1888లో
ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. గోర్కీ తన పదేళ్ల వయసు నుండీ పొట్ట చేత్తో
పట్టుకొని రకరకాల పనులన్నీ చేశాడు. చివరకు ఒక వర్క్ షాపులో కూలీగా చేరాడు.
అప్పుడే ఆయన తన తొలి కథను ప్రచురించాడు. దాంతో ఆయన ఖ్యాతి వెలుగులోకి
వచ్చింది. చిన్న కథలు రాయడంలో నిపుణుడనే పేరు వచ్చింది. క్రమంగా ఆరితేరిన
రచయితగా, రష్యాలోని గొప్ప రచయితల్లో ముఖ్యుడుగా ప్రసిద్ధిగాంచాడు. ఆయన
రాసిన నవలల్లో ‘అమ్మ’ (మదర్) నవల ముఖ్యమైనది. కేడెన్సు, బైస్టాండర్,
మాగ్నెటు మొదలైన అనేక
నవలలను ఆయన రచించారు. చాలాకాలం యాజీన్ నవజీవన్ అనే పత్రికకు సంపాదకత్వం కూడా నిర్వహించారు.
అప్పట్లో రష్యాలోని నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు జరిగిన రష్యా విప్లవ పోరాటంలో కూడా గోర్కీ పనిచేశాడు. తన కథల ద్వారా, నవలల ద్వారా పెద్దఎత్తున ప్రచారం చేశాడు. 1905లో పీటర్స్ బర్గ్ లో జరిగిన గలాటాలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ సందర్భంలో గోర్కీకి కూడా శిక్షపడింది. 1917లో జరిగిన మహావిప్లవంలో కూడా ఆయన పాల్గొన్నాడు. రష్యా విప్లవం సమయంలో అనేక సంవత్సరాలు పనిచేసి, అందులో పాల్గొన్న ఎంతో మంది వీరులను గూర్చి, విప్లవం యొక్క ఆటుపోట్లను గూర్చి బాగా అవగాహన చేసుకొన్న గోర్కీ... తన ‘అమ్మ’ నవలలో వాటన్నింటినీ కూర్చి అద్భుతమైన రచన చేయగలిగాడు. గోర్కీ కేవలం ఉద్యకారుడిగానో లేదా సాహిత్య కారుడిగానో పరిమితం కాడు. సత్యాన్వేషణలో అన్ని అవరోధాలనూ అధిగమించి నిలబడ్డ ఒక ఉన్నతమైన వ్యక్తి. అందుకు ఓనమాలు ఆయన ‘అమ్మ’ నవలలోనే దిద్దాడు. నిన్న, నేడు, రేపు తరం ఏదైనా... రచయితలందరికీ గోర్కీ జీవితం, సాహిత్యం ఓ కరదీపిక.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి