మధ్యతరగతి కుటుంబ జీవనం
చుట్టూ నడిచిన కథ ఈ నవల. కథ పాతదే అయినా నడిపించిన తీరు కొత్తగాను,
ఆసక్తికరంగానూ వుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మనసున్న మనుషుల మానసిక
సంఘర్షణ. అంతేకాకుండా రచయిత్రి తంబళ్లపల్లి రమాదేవి 'స్ఫూర్తి' నవలలో
భార్యాభర్తల వ్యక్తిగత జీవితంలోని అన్ని కోణాలనూ చిత్రించారు. రమాదేవికి
ఇది రెండవ నవల. ఇంతకుముందు 'మధులిక' అనే నవలను రచించారు.
పెట్టుబడిదారీ వ్యవస్థలో వస్తున్న మార్పులు ఉమ్మడి కుటుంబాలపైన, కుటుంబ జీవనంపైనా ఎలాంటి ప్రభావం చూపుతుంది, తెచ్చిపెట్టుకున్న ఆధునిక పోకడల వల్ల కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైపోతాయో రచయిత్రి చక్కగా వివరించారు. ముఖ్యంగా ఈ నవలలో కీలకమైన మూడు పాత్రలూ మహిళలే కావడం విశేషం. ఒకరు తెచ్చిపెట్టుకున్న ఆధునికతతో డాంబికాలు ప్రదర్శించే అత్తగారు. ఎంతసేపూ ఎదుటివారిలో తప్పొప్పులు వెదికి,
వారిని చులకనగా చూసే స్వభావం. తన వల్ల ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నమైనా పట్టించుకోని అహంభావి. లాప్‌టాప్ కొనిచ్చినందుకు తల్లి బుగ్గపై ముద్దుపెట్టిన కూతురుతో ''అబ్బ చాల్లే.. ఈ ముద్దు ముచ్చటలకేం తక్కువలేదు చీప్‌గా'' అంటుంది. తల్లీ పిల్లల మధ్య ఉన్న అనుబంధాన్ని వ్యక్తీకరించే తీరును కూడా ఆమె చీప్‌గా చూస్తుంది. ఇక రెండో పాత్ర కాత్యాయిని. ఈమె జానకి ఆడబిడ్డ. ఆమెకు తన మేనల్లుడంటే పంచ ప్రాణాలు. అతనికి దూరం కావడం ఇష్టంలేక మంచిమంచి సంబంధాలను కూడా వదులుకొని పక్క ఊరులోని ఓ సాధారణ రైతును పెళ్లి చేసుకుంటుంది. ఆ విధంగానైనా తన మేనల్లుడు తనకు దగ్గరగా వుంటాడని భ్రమపడుతుంది. ఒక మూడవ పాత్ర, ముఖ్యమైన పాత్ర రమ్య. జానకి పెద్ద కోడలు. ఐఎఎస్‌కు ప్రిపేర్ అవుతోన్న ఓ మధ్యతరగతి అమ్మాయి. ఉన్నతమైన వ్యక్తిత్వం ఈమె సొంతం. స్నేహభావం, కలుపుగోలుతనం ఆమె నైజం. భార్యగా, కోడలిగా, వదినగా, సోదరిగా రమ్య పాత్రను మూర్తీభవించిన వ్యక్తిత్వంతో తీర్చిదిద్దారు రచయిత్రి. తనకంటే చిన్నవారిని, పెద్దలను సహితం దారిలో పెట్టడానికి ఒక స్త్రీ పడే తపనను, తన మానసిక సంఘర్షణను మన కళ్లముందు ఆవిష్కరించారు. ఈ మూడు పాత్రల్లోనూ వారివారి వ్యక్తిత్వాల చిత్రణలో చివరి వరకూ ఎక్కడా బిగి సడలకుండా నడిపించిన తీరు... వారి అంతరంగ సంఘర్షణను అక్షరీకరించిన వైనం ఆసక్తికరంగా వుంటుంది.
ఇంటిని సంస్కరించడానికి పూనుకున్న రమ్య మొదట భర్త శేఖర్ సహకారాన్ని కోరుతుంది. ''నువ్వో అపురూపమైన అద్వితీయమైన అమ్మాయివి. నువ్వేం చేసినా అందులో ఏదోక మంచి దాగివుంటుంది. నువ్వు నాకసలు చెప్పిచేసినా, చెప్పకుండా చేసినా నేనేం అనుకోను. నీ మీద ఎంత ప్రేమ వుందో... అంత నమ్మకమూ వుంది'' అంటూ ఆమెకు పూర్తిగా సహకరిస్తాడు.
కుటుంబం జీవనంలో వుండే ఆటుపోట్లు, అత్తగారి అసహనాలు, అన్నదమ్ముల ఆప్యాయతలు, అనురాగాలు, అక్కడక్కడ ప్రేమ మైకాలు చదువరులను ఆకట్టుకుంటుంది. మనస్సును ఆహ్లాదపరుస్తుంది. ఒక తరంలో కోడలి పోకడ వల్ల విచ్ఛిన్నమైన ఉమ్మడి కుటుంబం... తర్వాతి తరంలోని మరో కోడలివల్ల సరిదిద్దబడుతుంది. 'స్ఫూర్తి' పేరుతో ఒక సీరియల్ రాస్తూ, ఆ సీరియల్ ద్వారా తమ కుటుంబ సభ్యులకు కనువిప్పు కలిగించే ప్రయత్నం చేస్తుంది. ముగింపు సగటు తెలుగు సినిమాలా అనిపించినా...ఆసక్తి కరంగా వుండడంతో ఏకబిగినా చదివింపచేస్తుంది.
- రాజాబాబు కంచర్ల

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి