పుస్తక పరిచయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పుస్తక పరిచయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, నవంబర్ 2016, బుధవారం

చైతన్యం నింపే కవితా జ్యోతులు

ఈ కవితా సంపుటిలోని ప్రతి అక్షరం అంబేద్కర్‌ భావజాలపు వెలుగులో చైతన్య కిరణం. ఈ కవితా సంపుటి సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్షలపై సంధించిన అక్షర తూణీరం. దళితుల ఐక్యత, ఆత్మాభిమానం, సామాజిక న్యాయం, రాజ్యాధికారం వంటి అంశాలపై కవి హృదయ స్పందనే ఈ కవితా సంపుటి. రచయిత చింతా అప్పారావు ఆంగ్ల భాషా అధ్యాపకులైనప్పటికీ సరళమైన భాషలో వ్యవస్థలోని లొసుగుల ముసుగుల్ని తొలగించి, వ్యవస్థ స్వరూపాన్ని, ఆయా వర్గాల భావోద్వేగాలను స్పష్టంగా, నిర్మొహమాటంగా వెల్లడించారు. 'చైతన్య జ్యోతులు' అనే

29, నవంబర్ 2016, మంగళవారం

సరోగసీకి సరైన అర్థం చెప్పిన 'పూలకుండీలు'


'ఆకుపచ్చ విధ్వంసం' నవలతో నవలా రచయితగా ఆవిర్భవించిన శిరంశెట్టి కాంతారావు మరో అద్భుత రచన 'పూలకుండీలు'. కవి, కథకుడు, నవలాకారుడుగా అన్ని పార్శ్వాలను స్పృశించిన శిరంశెట్టి... పవిత్రమైన మాతృ గర్భాన్ని కూడా అంగడి సరుకుగా మార్చేసిన ఆధునిక వ్యవస్థ అని చెప్పుకునే అస్తవ్యస్థ వ్యవస్థ వికృతరూపాన్ని 'పూలకుండీలు' నవల ద్వారా బట్టబయలు చేశారు. నిరుపేద అద్దె గర్భపు తల్లుల ఆక్రోశాన్ని అత్యంత హృద్యంగా చిత్రించారు. తొమ్మినెల్ల పేగుబంధపు ప్రతిరూపం ఎలావుందో ఒక్కసారన్నా కళ్లారా చూసుకునే అవకాశం ఇవ్వకుండానే పూలకుండీల నుంచి వేరుచేసిన మొక్కల్లా క్షణాల్లో తల్లీ బిడ్డలను వేరేసి ఎగరేసుకుపోతారంటూ రచయిత తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు. నవలా శీర్షిక కూడా అర్థవంతమైన ఎంపిక. పేదరికాన్ని ఆసరాచేసుకుని కొన్ని ఏజెన్సీలు పేదరాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నాయి. సరోగసీ (అద్దెగర్భం) నేడు మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ విచ్చల విడిగా వేళ్లూనుకుంటోంది. మన దేశంలో 5000 మిలియన్లకు పైగా ఈ వ్యాపారం సాగుతోందని ఒక అంచనా.
పేదరికాన్ని అడ్డుపెట్టుకొని మధ్య దళారీలు, వడ్డీవ్యాపారులు, మైక్రో ఫైనాన్స్‌ వంటి సంస్థలు పేదల రక్తాన్ని పీల్చుతూ.. వాళ్ల జీవితాలను ఎలా ఛిద్రం చేస్తారో కళ్లకు కట్టినట్లు వర్ణించారు రచయిత. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మోసపోతున్న పేదలు సరైన సమయానికి ప్రభుత్వం బిల్లులు చెల్లించక, పూరి గుడిశలతో తెల్లారిపోతున్న తమ

2, మే 2016, సోమవారం

'నిశ్చల'మైన ప్రేమకథ

      'నిశ్చల'మైన.. స్వచ్ఛమైన ప్రేమకథ... ఉండవిల్లి.ఎం రాసిన ఈ నవల. చక్కని ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. కాలేజీ నేపథ్యంలో జరిగే ప్రేమలు... అది దాటి బయటికొస్తే సమాజంలో ఎదురయ్యే సమస్యల సుడిగుండాలు... వాటిని ఎదుర్కొని నిలబడగలిగే ఆత్మవిశ్వాసం... నలుగురికీ స్ఫూర్తినిచ్చే ఆదర్శవంతమైన జీవితం... వెరసి ఒక మధ్య తరగతి యువతి జీవితంలో ఎదురైన అనేక కోణాలను రచయిత చక్కని శైలితో అక్షరీకరించారు. ముఖ్యంగా కథానాయిక నిశ్చల పాత్ర చిత్రీకరణలో తొణకని వ్యక్తిత్వాన్ని నిండుగా నింపారు. మిగతా కథంతా ఈ పాత్రను అల్లుకొనే వుంటుంది గనుక ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.
అందం, అణకువ, ఆత్మాభిమానం, తొణకని వ్యక్తిత్వం వున్న మధ్యతరగతి అమ్మాయి నిశ్చల. అనుకోకుండా ప్రేమలో పడుతుంది. సంతోష్‌ని

12, ఏప్రిల్ 2016, మంగళవారం

మనసున్న మనుషుల మానసిక సంఘర్షణే ''స్ఫూర్తి''

మధ్యతరగతి కుటుంబ జీవనం చుట్టూ నడిచిన కథ ఈ నవల. కథ పాతదే అయినా నడిపించిన తీరు కొత్తగాను, ఆసక్తికరంగానూ వుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మనసున్న మనుషుల మానసిక సంఘర్షణ. అంతేకాకుండా రచయిత్రి తంబళ్లపల్లి రమాదేవి 'స్ఫూర్తి' నవలలో భార్యాభర్తల వ్యక్తిగత జీవితంలోని అన్ని కోణాలనూ చిత్రించారు. రమాదేవికి ఇది రెండవ నవల. ఇంతకుముందు 'మధులిక' అనే నవలను రచించారు.
పెట్టుబడిదారీ వ్యవస్థలో వస్తున్న మార్పులు ఉమ్మడి కుటుంబాలపైన, కుటుంబ జీవనంపైనా ఎలాంటి ప్రభావం చూపుతుంది, తెచ్చిపెట్టుకున్న ఆధునిక పోకడల వల్ల కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైపోతాయో రచయిత్రి చక్కగా వివరించారు. ముఖ్యంగా ఈ నవలలో కీలకమైన మూడు పాత్రలూ మహిళలే కావడం విశేషం. ఒకరు తెచ్చిపెట్టుకున్న ఆధునికతతో డాంబికాలు ప్రదర్శించే అత్తగారు. ఎంతసేపూ ఎదుటివారిలో తప్పొప్పులు వెదికి,

అక్షర తూణీరాలు.. గణపతిరావు కథలు

గణపతిరావు రచన చేసిన 'ఆకుపచ్చ అంటుకుంది' కథాసంకలనంలోని అన్ని కథలు సమాజంపై సంధించిన అక్షర తూణీరాలే. రచయిత సామాజిక దృక్పథమే ఈ రచనకు బలం చేకూర్చింది. సమకాలీన స్థితిగతులపై పదాల తూటాలను పేల్చుతూ.. కథను చెప్పడంలో తనదైన ఒక ప్రత్యేక శైలిని రచయిత అనుసరించారు. కథలకు పెట్టిన శీర్షికలు కూడా అర్థవంతంగా, ఆకర్షణీయంగా, ఆలోచనాత్మకంగా వున్నాయి. పుస్తకం ముఖచిత్రం నుంచి, ప్రతి కథనూ ప్రారంభించిన తీరు, ఆయా కథలకు వేసిన చిత్రాల వరకూ కథా సంకలనం యొక్క ప్రత్యేకతను చాటుతాయి.
'ప్రకృతిని కాపాడలేనివారికి జీవించే హక్కులేదు' అంటూ 'ఆకుపచ్చ అంటుకుంది' కథలో ఒక కాకితో చెప్పిస్తాడు రచయిత. ఈ కథ చదివితుంటే... అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు చేస్తోన్న ప్రకృతి విధ్వంసం గుర్తుకురాక మానదు. ఇలాంటిదే 'ఆకులు కాలాక చేతులు' కథ. కొమ్మలు, రెమ్మలు, ఆకులతో కళకళలాడే చెట్టు.. ఆ కొమ్మలు విరిగి,

సమాజంలోని అవకతవకలపై కళాత్మక విశ్లేషణ... ''కడుపుకోత'' కథాసంపుటి

తెలంగాణా మాండలికంలో వచ్చిన తొలి కథా సంపుటి 'కడుపుకోత'. ఈ సంపుటి కడుపుకోత కథతోనే ప్రారంభం అయింది. తెలంగాణా మాండలికం మీద మంచి పట్టున్న దేవరాజు మహారాజు రచించిన ఈ కథాసంపుటిలో పది కథలున్నాయి. ఈ పది కథల్లోనూ వారు ఎంచుకున్న కథా వస్తువు ప్రజాజీవనానికి సంబంధించిదే. నిత్యజీవితంలో మనం రోజూ చేసే సంఘటనలను వారు చక్కని కథలుగా మలిచిన వైనం చదువరులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.

సమాజాన్ని పరిచయం చేసే కథలు... 'చింతా దీక్షితులు సాహిత్యం-2'

తెలుగు కథా సాహిత్యంలో తొలితరం కథకుల్లో ముఖ్యులు చింతా దీక్షితులు. తెలుగు కథ నడకలు నేర్చుకుని సరైన మార్గంలో పయనించడానికి బాటలువేసిన ముఖ్యుల్లో దీక్షితులు ఒకరు. భాషలో, శిల్పంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న కథకుడు. ఆయన రచించిన కథలను ఏకాదశి కథలు, దాసరిపాట, హాస్యకథలు, మిసెస్‌ వటీరావు కథలు అని నాలుగు భాగాలుగా వర్గీకరించి 'చింతా దీక్షితులు సాహిత్యం-2' పేరుతో ఈ సంకలనం ప్రచురించారు. ఈ నాలుగు విభాగాల్లోనూ మొత్తం 42 కథలున్నాయి. ఏకాదశి కథల్లో 'శ్యామల' కథలో కథానాయకుడు శ్రీధరరావు బ్రహ్మచారి. ఆయన ప్రేమించిన శ్యామల జబ్బు చేసి మరణించడంతో ఒంటరిగా మిగిలిపోయాడు. హాస్యకథలు విభాగంలో డబ్బు డబ్బు డబ్బు, ముడు కుక్కలు ముఖ్యమైనది.

వాస్తవ ఘటనలే కథావస్తువుగా... 'శిశిరవేళ'

సమాజంలోని వాస్తవ ఘటనలను కథలుగా, నవలలుగా మలచడంలో విశేషానుభవం గడించిన ప్రముఖ రచయిత పెద్దిభట్ల సుబ్బరామయ్య గారి వాస్తవ ఘటనల సమాహారం.. ఈ కథల సంపుటం. 2012 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న పెద్దిభట్ల 'శిశిరవేళ' పేరుతో వెలువరించిన ఈ కథాసంపుటంలో 18 కథలున్నాయి. వీటిలో 'అర్జునుడు' పెద్ద కథ. మధ్యతరగతి ప్రజల జీవితాలు, కుటుంబ నేపథ్యం, వారి కష్టసుఖాలకు నిలువుటద్దం ఈ కథా సంకలనం. గురజాడ, శ్రీపాద, కొ.కు, గోపీచంద్‌, చాసో వంటి కథకుల కోవకు చెందినవారు పెద్దిభట్ల సుబ్బరామయ్య. జీవితంలోని వాస్తవికతను... వాస్తవిక, అభ్యుదయ దృక్పథంతో విమర్శనాత్మకంగా విశ్లేషించి శిల్పాత్మకంగా రూపు కట్టించే సంప్రదాయానికి వారసుడీయన.

11, ఏప్రిల్ 2016, సోమవారం

రాయలసీమ జన జీవన చిత్రణే 'రావణ వాహనం'

రాయలసీమ నేపథ్యంలో స్థానిక ప్రజల భాష, యాస, సంస్కృతికి ప్రతిబింబం 'రావణ వాహనం' కథలు. ఈ కథా
ఈ పుస్తక రచయిత డాక్టర్‌ వేంపల్లి గంగాధర్‌ నవలా రచయిత, కథకుడు, విమర్శకుడు, సామాజిక చరిత్రకారుడు, అధ్యాపకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని తెలుగులో మొదట అందుకున్న యువ రచయిత. ఈ సంపుటిలోని కథలన్నీ రాయలసీమ జీవిత మూలాలు రచయిత దృక్పథం నుంచి, ఆయన అన్వేషణ నుంచి జాలువారిన జీవన సత్యాలు. కరువు, కక్షలు కోణాన్ని స్పృశిస్తూనే వివిధ సామాజికాంశాలను ఇతివృత్తాలుగా తీసుకున్నారు. ముఖ్యంగా సీమ ప్రజల భాష కథలలోని పాత్రధారుల భాషగా మనకు కనిపిస్తుంది... వినిపిస్తుంది.