29, నవంబర్ 2016, మంగళవారం

పులకింత


ఏదో తెలియని తుళ్లింత
నీ మనసు తెలిసిన పులకింత
ఎన్నోనాళ్ల వేచిన వలపంతా
పూలజల్లై కురిసెను మనసంతా
మౌనం విచ్చుకున్న పువ్వయితే
ఇంక ఆపతరమా ఆ పరిమళాలు
నిశ్శబ్దం ఝంఝానిలం అయితే
చిరుగాలి వీయదా శరచ్ఛంద్ర వీచికలు
పరవళ్లు తొక్కే సంతోషం
మది విరబూసిన పూదోట పరిమళం
నిశీధి నీరవంలో వెలుగు సంతకం
వినీలాకాశంలో విహరించే ప్రేమపావురాలం
- రాజాబాబు కంచర్ల
21-05-2016

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి