30, నవంబర్ 2016, బుధవారం

ఓ చెలియా నా ప్రియ సఖియా

ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుందని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవసమై ఇరు కన్నులు సోలెనులే
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
ఈపూట చెలి నా మాట ఇక కరువైపోయెనులే
ఆధారము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో అర క్షణమొక యుగమేలే
చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయెనులే
ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే
ఈ జీవికి జీవన మరణమూ నీ చేతిలో ఉన్నదిలే
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
కోకిలమ్మ నువ్వు సై అంటే నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకొని సవరించేను నీ కురులే
వెన్నెలమ్మ నీకు జోల పాడి కాలి మెటికెలు విరిచేనే
నీ చేతి చలి గాలులకు తేరా చాపి నిలిచేనే
నా ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే
నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి