30, నవంబర్ 2016, బుధవారం

రవీంద్రనాథ్ ఠాగూర్ ‘‘వనమాలి’’ -39

పూలతో ఓ మాల నల్లాలని ఉదయమంతా చూశాను
కాని పువ్వులు జారిపడిపోయాయి
వెతికే నీ కళ్ల కొనలనించి, నన్ను రహస్యంగా చూస్తూ కూచుంటావు
రహస్యంగా అల్లరి ఎత్తులు వేసే ఆ కళ్లని అడుగు ఎవరి తప్పో అది.
నేను పాట పాడదామని ప్రయత్నించాను, కానీ చేతకాలేదు.
నేనెందుకు పాడలేకపోయానో
నీ పెదిమల మీద దాక్కుని దోబూచులాడే చిరునవ్వుని అడుగు.
పద్యంలోని మత్తెక్కిన మధుపం వలె
నా కంఠస్వరం, నిశ్శబ్దంలో ఎట్లా ఇంకిపోయిందో
నీ చిరునవ్వే పెదవుల్ని ప్రమాణం చేసి చెప్పమను.
సాయంత్రమయింది... పుష్పాలు ముకుళించుకునే సమయమయింది.
నీ పక్కన కూచుని నక్షత్రాల మసక వెలుతురులో,
నిశ్శబ్దంలో చెయ్యడానికి వీలయ్యే దానిని నా పెదవుల్ని చెయ్యమని ఆజ్ఞాపించు
---------------------------------------------------------------
రవీంద్రనాథ్ ఠాగూర్ ‘‘వనమాలి’’ -39, అనువాదం : చలం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి