30, నవంబర్ 2016, బుధవారం

మరుమల్లెపూవు



నా పేరు మరుమల్లెపూవు
నా మనసు తెలుపు
నా రూపు తెలుపు
నా తనువు తెలుపు
తల్లి తీగన విరగబూస్తా
నేల రాలేవరకు పరిమళాలు విరజిమ్ముతా
నేల రాలి నీ పాదాల కింద నలుగుతా
నువు నడిచే దారిలో పూలబాటనవుతా
కోమలమైన నీ పాదాలు కందకుండా పూలపాన్పునవుతా
నీ పాదాల కింద నలిగినా...
సువాసనల పారాణినద్దుతా
భూమిలో కలసి పోయే వరకూ...
నిను వీడని వలపునవుతా
నీ ప్రేమనవుతా....
- రాజాబాబు కంచర్ల
27-06-2016

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి