29, నవంబర్ 2016, మంగళవారం

స్వాగతం ప్రియతమా

అందాల సరిమల్లె పువ్వా..
అధరాన మెరిసేటి నవ్వా..
ఎదలోన దాగున్న గువ్వా..
స్వాగతం ప్రియతమా
నిను మరచిందిలేదు
నువు నను వీడిందిలేదు
అందెల గలగలలో నడిచే కోమలి
కోయిల పాటలతో పిలిచే నా చెలి
నీకిదే స్వాగతం ఎద లోగిలిలోకి
ఎప్పటికీ ఉండిపో.. మది కోవెలలోనే
గుండె దాహంతో ఎదురు చూస్తోంది ఆర్తిగా
వెల్లువలా కదలిరా...వాసంత సమీరంలా

నీ ప్రేమామృతాన్ని ప్రవహింపచేయి నిండుగా
నీ ప్రేమలో నన్నమరుడ్ని చేయి పసందుగా
- రాజాబాబు కంచర్ల
14-06-2016

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి