30, నవంబర్ 2016, బుధవారం

గతాన్ని మరిచారా...?

వసతి గృహాల మూసివేతపై గళమిప్పితే..
కర్కశంగా గొంతు నులుముతారా?
మెస్‌ ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తే
మెడకు చున్నీలు చుట్టి అమానుషంగా ఈడ్చుతారా?
ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ..
కార్పొరేట్ స్కూళ్లకు ద్వారాలు తెరుస్తారా?
ఇదేమీ రాజ్యం...ఇదేమీ పాలన సిగ్గు.. సిగ్గు..
ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకైన ఖర్చెంత?
స్విస్ ఛాలెంజ్ పేరుతో అనుంగులకు కట్టబెట్టిన భూముల విలువెంత?
రాజధాని పేరుతో లాక్కున్న పచ్చని పొలాలకు కట్టిన వెల ఎంత?

సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణకయ్యే వ్యయమెంత?
గతాన్ని అప్పుడే మరిచారా...?
అంగన్వాడీలను గుర్రాలతో తొక్కిస్తే...
విద్యుత్ ఉద్యమంపై తుపాకీలు ఎక్కుపెడితే...
విద్యార్థి ఉద్యమాలపై లాఠీలు ఝుళిపిస్తే..
అనుభవించిన పదేళ్ల రాజ్యభ్రష్టత్వం
ఓసారి జ్ఞప్తికి తెచ్చుకోండి మహాప్రభో...
(గురుకులాల పేరిట మూసివేసిన హాస్టళ్లను పున:ప్రారంభించాలని,
మెస్‌ ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ
25-07-2016 సోమవారం విజయవాడలో
విద్యార్థులు నిర్వహించిన మహాధర్నాలో పోలీసుల ప్రతాపం.)
- రాజాబాబు కంచర్ల
26-07-2016

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి