29, నవంబర్ 2016, మంగళవారం

విరిసిన కమలం


హృదయం విరిసిన కమలం
ఉదయం హృదయ కోకిల గీతం
వదనం ప్రకృతి సోయగం
అధరం మది పరవశాల చుంబనం
హృదయమనే అద్దంలో
కనిపించే ప్రతిబింబం నీ రూపం
పూవుల సరాగాలలో
ఊసుల సరిగమల మాధుర్యం నీ స్వరం
శూన్యమైన వేణువులో
ఆమని ఒలికించి పలికిందొక గమకం
అనురాగపు జతలో
పయనించే తోడుగా నిలువనా జీవితాంతం
అధరాలు చిలికే మధురిమలు
అనురాగము లొలికే సరిగమలు
మధువును గొలిపే అందాలు 

కనువిందులు చేసే జలతారులు
వసంతగాలులు రేపే వలపులు
తనువులు చేసే అల్లరులు
- రాజాబాబు కంచర్ల
20-05-2016

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి