కలలోనైనా చెప్పవా నను ప్రేమించానని
మెలకువనైనా చెప్పవా నీ మనసు నాదని
ఆ మాటతోనే బతికేస్తా కలకాలం
ఆ ప్రేమకై అర్పిస్తా నా సర్వస్వం
శిలగా మారితి నే నిను చూసిన తొలి క్షణం
అలగా ఎగసెను లే మాట రాని మౌనం
కనులు మూసినా నువ్వే కలత నిదురలో సైతం
పగలైనా రేయయినా మనసులో నీ ధ్యానం
హరివిల్లై విరిసిన నీ అందం
ఇంద్రధనుసై మెరిసిన నీ సోయగం
మదిలో పరచిన వెన్నెల జలపాతం
తుదివరకు నిలుపుకునే మధుర సంతకం
నీ ఊహలతో గంగై పొంగే మనసును
తుంటరి జలపాతంలా కమ్ముకుని
పెదవులపై ఆకుపచ్చని ముగ్గేస్తావా
ఎదలో ఎప్పటికీ చెరగని నీ రూపం పచ్చబొట్టేస్తావా..
- రాజాబాబు కంచర్ల
02-05-2016
మెలకువనైనా చెప్పవా నీ మనసు నాదని
ఆ మాటతోనే బతికేస్తా కలకాలం
ఆ ప్రేమకై అర్పిస్తా నా సర్వస్వం
శిలగా మారితి నే నిను చూసిన తొలి క్షణం
అలగా ఎగసెను లే మాట రాని మౌనం
కనులు మూసినా నువ్వే కలత నిదురలో సైతం
పగలైనా రేయయినా మనసులో నీ ధ్యానం
హరివిల్లై విరిసిన నీ అందం
ఇంద్రధనుసై మెరిసిన నీ సోయగం
మదిలో పరచిన వెన్నెల జలపాతం
తుదివరకు నిలుపుకునే మధుర సంతకం
నీ ఊహలతో గంగై పొంగే మనసును
తుంటరి జలపాతంలా కమ్ముకుని
పెదవులపై ఆకుపచ్చని ముగ్గేస్తావా
ఎదలో ఎప్పటికీ చెరగని నీ రూపం పచ్చబొట్టేస్తావా..
- రాజాబాబు కంచర్ల
02-05-2016
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి