ఓ నా ప్రియమైన మేఘమాలా...
అర్థరాత్రి మెలకువ వస్తే...
నిద్ర దూరమై..
మనసు బరువై
ఫోన్ అందుకొని మనసు బరువు దించుకుందామనుకుంటే..
అయినా ఏదో అలజడి...
ఎంత దాయాలని ప్రయత్నించినా... దాగకుండా
సునామీలా ఎగసిపడుతుంటే...
మనసులోని భావాలను ఎంత తొక్కిపెట్టినా ఆగక..
చాపకింద నీరులా ప్రవహించి నన్ను చేరుకున్నాయి సుమా...
నిద్రమత్తులో... ఆ హస్కీ వాయిస్ ఎంత బాగుందనీ...
అది ఎంతకీ తృప్తి కలగని మధుర భావమది...
ఆ అనుభూతిని ఏ కవి మాత్రం వర్ణించగలడు..
కృష్ణశాస్త్రిని కాలేకపోయానే అని ఎంత బాధపడ్డానో....
లేకపోతే ఆ అనుభూతిపై ఎన్ని కవితలు రాసేవాడ్నో...
మాటల సందర్భంలో అన్నావు చూడు...
నేను బతికిఉన్నంత వరకూ... కన్నీరు పెట్టుకునే సందర్భం రానీయననీ...
ఆ మాటలను ఎంత స్థిర చిత్తంతో చెప్పావనీ...
అవలా గుండెల్లో శిలాక్షరాలుగా ముద్రితమయ్యాయి...
ఒక్కసారిగా మనసులో ఉద్వేగం పెరిగిపోయింది
మాటలురాని మూగనే అయ్యా...
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా...
ఎన్నివేల మైళ్ల దూరంలో నీవున్నా....
వెంటనే వచ్చేసి... నిన్ను గాఢంగా హత్తుకోవాలనిపించింది.
మనసునిండా దాచుకోవాలనిపించింది...
ఎందుకటా... ఆ కళ్లు అంత చిలిపిగా నవ్వుతున్నాయి...
అవునులే... ఆ కళ్లు నన్నెంత లోబరచుకున్నాయో...
అందుకే వాటికంత చిలిపితనం.....
ఓ మేఘమా...
రాత్రిళ్లు నిద్రపడితే ఆమె రూపమే కలలో కూడా
ఉదయమే లేచి మా పూదోటకు వచ్చినా ఆమె జ్ఞాపకాలే మనసునిండా...
నీ జ్ఞాపకాలతో
ఎనిమిదవ రోజు
02-05-2016

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి