1, మే 2016, ఆదివారం

రోజా రోజా.. రోజా రోజా..

పల్లవి:
రోజా..... రోజా........
రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా
రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా
నిను గాలి సోకగా వదలనులే
నెలవంక తాకగా వదలనులే
ఆ బ్రహ్మ చూసినా ఓర్వనులే నే  ఓర్వనులే  నే ఓర్వనులే
రోజా...... రోజా.......
రోజా...... రోజా.......

చరణం1:
కన్నులలో... కొలువున్నావులే ...
రాతిరిలో... కనులకు కునుకే లేదులే...
వలుపగా నన్నూ చుట్టుకోగా
నీ సన్నని నడుముకు కలుగును గిలిగిలి నా.. రోజా..
నీ పేరు నానోట నే చెప్పగా
నా ఇంట రోజాలు పూచేనులే
నీ జాడ ఒకరోజు లేకున్నచో
నీ చెలియ ఏదంటూ అడిగేనులే
నీ రాకే... మరుక్షణం తెలుపును మేఘమే..
వానలో... నువు తడవగా నా కొచ్చెనే జ్వరం..
ఎండలో.. నువు నడవగా నాకు పట్టే స్వేదం
తనువులే రెండు హృదయమే ఒకటి రోజా రోజా రోజా......(రోజా రోజా)

చరణం2:
నవ యువతీ..... నడుమొక గ్రంధము
చదివేనా పలుచని రాత్రిలో మంచులో
దూరాలేలా జవరాలా... బిడియాన్ని ఒకపరి విడిచిన మరి.. తప్పేముంది
నన్నే నువ్వు తాకొద్దని గగనాన్ని ఆపేనా ఆ సాగరం
నన్నే ముట్టుకోవద్దని చేతులకు చెప్పేనా ఆ వేణువు
నీ స్పర్శే... చంద్రుని మచ్చలు మాపులే
కనులలో.. జారెడు అందాల జలపాతమా...
నన్ను నువ్వు చేరగా ఎందుకాలోచన..
నీ తలపు తప్ప మరుధ్యాస లేదు నా రోజా రోజా రోజా......(రోజా రోజా)


చిత్రం : ప్రేమికుల రోజు (1999)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
రచన : ఎ.ఎం.రత్నం, శివగణేష్
గానం : ఉన్నికృష్ణన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి