6, మే 2016, శుక్రవారం

11వ రోజు

నా ప్రియమైన మేఘమాలా...

నీకు ఉత్తరం రాసి నాలుగురోజులైపోయింది.
వెళుతూ వెళుతూ నా శక్తినంతా నువ్వు గుంజుకుపోయావేమో..
నిస్సత్తువగా మిగిలా నేను..
ఏ పనీ చేయలేకపోతున్నా...
కళ్లుమూసినా.. తెరచినా.. నీ రూపమే.
నా సమయమంతా నన్ను నేను ఓదార్చుకోడానికే ..
నీ చిత్తరువును చూస్తూ...
నిమిషాలను గంటల్లా... గంటలను రోజుల్లా గడిపేస్తున్నా..
ఇది రాస్తుంటే... ఏదో సినిమాలో పాట లీలగా వినిపిస్తోంది..
‘‘నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది నిలిచందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా
నిముషాలు శూలాలై వెంటాడుతున్నా
ఒడి చేర్చుకోవా వయ్యారి
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా
ఓదార్చిపోవా ఓ సారి...’’
నా పరిస్థితీ అలాగే వుంది బంగారం.
తనువంతా కళ్లు చేసుకొని ఎదురుచూస్తున్నా..
నిను చూసే క్షణం కోసం.
కాలం ఎంత కఠినమైనదీ...
రోజులు ఎంత నెమ్మదిగా జరుగుతున్నవో కధా
నువ్వు ఎప్పుడెప్పుడొస్తావో అని
ఇప్పటినుంచే రెడీ అవుతున్నా...
ఎంతుకలా నవ్వుతావు బంగారం
నువ్వలా కొంటెగా నవ్వితే
అలా హస్కీగా మాట్లాడితే
నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను సుమా...

నీ జ్ఞాపకాలతో

11వ రోజు
05-05-2016


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి