12, మే 2016, గురువారం

మమతే నీవుగా..

ఉండాలీ నా ఎదలో.. మమతే నీవుగా
నిండాలీ నా కనులలో.. వెలుగే నీవుగా
ఉండాలీ జన్మజన్మలకు నా తోడే నీవై
నిండాలీ మనసునిండుగా నా చెలి నీవై

పున్నమి వెలుగుల్లా వెన్నెల సుధలు చిలికించవా
చిరుగాలి కెరటాల్లా మనసు వీణలు పలికించవా
జవరాలి పయ్యదలా మదిలో చిగురాశలే ఊరించగా
చెలికాని హృదయంలో విరి తేనియలే ఒలికించవా

ఉంటాను నీ తలపులలో వాడిపోని చిరునవ్వుగా
ఉంటాను నీ మనసు కోవెలలో చిరు వెలుగుగా
ఉంటాను నీ అడుగులలో అడుగునై చివరిదాకా
ఉంటాను నీ జతగా జన్మజన్మలకు వీడనితోడుగా

- రాజాబాబు కంచర్ల
12-05-2016

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి