3, మే 2016, మంగళవారం

మనసంతా నువ్వే..

మనసంతా నువ్వే..
కలనైనా ఇలనైనా నీ ధ్యాసే..
నే తలచే తలపులలో
మది నిండిన చెలిమెలగా..
నే నడిచే దారులలో
పున్నమి వెన్నెలగా...
ఎప్పటికీ మనసులోనే
కొలువైన ప్రణయరాణిగా...
వసంతాలు పూయించేవో
ప్రణయరాగాలు ఆలపించేవో
వలపు సితారను మీటేవో

తనువులు వేరైనా
మనసులు ఒక్కటే
చూసే చూపులు వేరైనా
చూసే రూపం ఒక్కటే
హృదయాలు వేరైనా
ఆలోచన తీరు ఒక్కటే
మార్గాలు వేరైనా
చేరే గమ్యం ఒక్కటే
కాలమెంత గాలమేసినా
ఎదురించే ధైర్యమొక్కటే

కౌగిళ్ల కోనలో
అందాల భామ వడిలో
మల్లెలా వడిలిపోనా జీవితాంతం...
యుగాలు సాగినా
తరాలు మారినా
ఈ బంధం నిలుపుకుందాం చిరకాలం...

- రాజాబాబు కంచర్ల
03-05-2016

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి