19, ఏప్రిల్ 2017, బుధవారం

నాటకం బతకాలి

 కావ్యేషు నాటకం రమ్యం!
నాటకాంతం హి సాహిత్యం
నాటకాంతం హి కవిత్వం
- అన్నట్టుగా...
వస్తురూపాన్నీ, భావగంధాన్నీ ఆనందాన్నీ, సామాజిక ప్రయోజనాన్నీ,
సందేశ స్వరూపాన్నీ పాఠక లోకానికీ, ప్రేక్షకులకూ
తెలియజేయడానికి
దృశ్యరూపకమైన సౌలభ్యం వుండటం వల్లనే నాటక ప్రక్రియ లలితకళల సమాహారమైంది.
రచయిత తాను చెప్పవలసిన విషయాన్ని, అందించవలసిన సందేశాన్నీ త్వరితగతిన
సామాజికుల హృదయంలో నాటడానికి, నాటకం అనువైన సాధనం.

30, నవంబర్ 2016, బుధవారం

ఎదలో ఉన్నది ఆలయము

01.
ఎదలో ఉన్నది ఆలయము
అది ఓ దేవత మందిరము
తానులేని నాడదో శిధిలాలయము

మాతృభాషకు పట్టం

తెలుగు భాషకు ప్రాచీన హోదా కిరీటం
ఇది తెలుగు జాతికి మకుటాయమానం
మాతృభాషకు పట్టం కడదాం
కొనఊపిరితో బతుకీడుస్తున్న తేటతెనుగును బతికించుకుందాం
ఇపుడైనా ఏలికలకు కలిగేనా జ్ఞానోదయం
ఇకనైనా వర్థిల్లేనా తెలుగు భాషావికాసం
నిర్మాణాత్మక దిశగా అడుగులు వేద్దాం
దశదిశలా తెలుగు వెలుగులు వ్యాపింపజేద్దాం
***
తెలుగు భాషకు ప్రాచీన హోదాపై దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. 2008 అక్టోబర్ 31న కేంద్ర ప్రభుత్వం అతి
ప్రాచీన భాషల్లో తెలుగును చేర్చింది. అయితే, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా భాషలకు ప్రాచీన హోదా
కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ 2009లో మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కాగా, తెలుగుతోపాటు కన్నడ,
మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా అర్హత ఉందని మద్రాసు హైకోర్టు సోమవారం (08-08-2016) తేల్చి
చెప్పింది. తెలుగును ఆధునిక భాషగా గుర్తించడంతో పాటు ప్రపంచ భాషగా మార్చేందుకు రెండు తెలుగు ప్రభుత్వాలు కృషి
చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
- రాజాబాబు కంచర్ల
08-08-2016

న్యూనతాభావం

మనసులోని భావాలు 
వెల్లువల ఉప్పొంగుతుంటే..
వ్యక్తీకరించడానికి 
అడ్డొస్తున్నదేదో న్యూనతాభావం
ఎవరికోసమే
మనసులోని భావాలను అదిమిపెడితే..
మాటల రూపంలోనో...
అక్షరాల రూపంలోనో బయటకు రావాలి
ఇంకా మిగిలివుంటే
కన్నీరై కారిపోవాలి
అప్పుడే...
బరువు దిగుతుంది
గుండె సేదతీరుతుంది
- రాజాబాబు కంచర్ల
08-08-2016

చైతన్యం నింపే కవితా జ్యోతులు

ఈ కవితా సంపుటిలోని ప్రతి అక్షరం అంబేద్కర్‌ భావజాలపు వెలుగులో చైతన్య కిరణం. ఈ కవితా సంపుటి సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్షలపై సంధించిన అక్షర తూణీరం. దళితుల ఐక్యత, ఆత్మాభిమానం, సామాజిక న్యాయం, రాజ్యాధికారం వంటి అంశాలపై కవి హృదయ స్పందనే ఈ కవితా సంపుటి. రచయిత చింతా అప్పారావు ఆంగ్ల భాషా అధ్యాపకులైనప్పటికీ సరళమైన భాషలో వ్యవస్థలోని లొసుగుల ముసుగుల్ని తొలగించి, వ్యవస్థ స్వరూపాన్ని, ఆయా వర్గాల భావోద్వేగాలను స్పష్టంగా, నిర్మొహమాటంగా వెల్లడించారు. 'చైతన్య జ్యోతులు' అనే

తెలిసిపోయింది

తెలిసిపోయింది ‘హోదా’కి అడ్డెవరో
నిరసనలు తెలిపేవారిని
లాఠీలతో బాదించి
వ్యాన్లలోకి ఈడ్పించి
మహిళల తాళిబొట్టు తెంపించి
కర్కోటకంగా వ్యవహరించి
అభినవ ‘నీరో’నని
మళ్లీ మళ్లీ రుజువు చేసుకొంటున్నదెవరో
తెలిసిపోయింది...
హోదాకు అడ్డెవరో తెలిసింది...
గజదొంగను సంకలో పెట్టుకొని
ఎదుటివారిపై నిందలు మోపి
సిసలైన నీతిమంతుడ్నని గప్పాలు కొట్టి
పచ్చమీడియాతో డబ్బా కొట్టించుకొని
తోకముడిచే బడాబాబుల బండారం
బట్టబయలయింది..
హోదాకు అడ్డెవరో తెలిసిపోయింది...
హోదా సంజీవని కాదు...
సింగపూర్ తరహా రాజధానులు
కజకిస్తాన్ తరహా భవంతులు
జపాన్ తరహా నిరసనలు
ఇక ఆంధ్రుల సంస్కృతికి కాలంచెల్లు
ఇవే బాబుగారి గీతోపదేశాలు
అందరికీ తేటతెల్లం అయింది
హోదాకు అడ్డెవరో తెలిసిపోయింది
ప్రత్యేక హోదా మన హక్కు
ఆంధ్రుడా చెయ్యి చెయ్యి కలుపు
దూసుకొంటూ..తోసుకొంటూ...
మన హక్కును నినదిస్తూ..
జగన్నాథ రథచక్రాలై
పోదాం...పోదాం.. మునుముందుకు...
- రాజాబాబు కంచర్ల
03-08-2016

ఎద లోగిలి

ఎద లోగిలిలో తీర్చిదిద్దిన రంగవల్లివీవు
కను దోయలలో దాగున్న స్వప్నికవీవు
మది ఊహలలో విరిసిన రంగుల హరివిల్లువీవు
అణువణువునా ప్రవహించే ప్రేమధార నీవు
హృది లోయలలో దాగిన భావాలను రగిలిగించిన చైతన్యమీవు
నేస్తమై మనసు దోచిన సౌందర్యవల్లివీవు
నీవులేని నేను...
శృతితప్పిన పల్లవిని
మూగబోయిన గేయాన్ని
రంగు వెలసిన చిత్రాన్ని
అర్థంలేని పద్యాన్ని
దేవతలేని నిలయాన్ని
శిథిలమైన ఆలయాన్ని
- రాజాబాబు కంచర్ల
31-07-2016

ఓ చెలియా నా ప్రియ సఖియా

ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుందని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవసమై ఇరు కన్నులు సోలెనులే
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
ఈపూట చెలి నా మాట ఇక కరువైపోయెనులే
ఆధారము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో అర క్షణమొక యుగమేలే
చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయెనులే
ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే
ఈ జీవికి జీవన మరణమూ నీ చేతిలో ఉన్నదిలే
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
కోకిలమ్మ నువ్వు సై అంటే నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకొని సవరించేను నీ కురులే
వెన్నెలమ్మ నీకు జోల పాడి కాలి మెటికెలు విరిచేనే
నీ చేతి చలి గాలులకు తేరా చాపి నిలిచేనే
నా ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే
నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే

గతాన్ని మరిచారా...?

వసతి గృహాల మూసివేతపై గళమిప్పితే..
కర్కశంగా గొంతు నులుముతారా?
మెస్‌ ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తే
మెడకు చున్నీలు చుట్టి అమానుషంగా ఈడ్చుతారా?
ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ..
కార్పొరేట్ స్కూళ్లకు ద్వారాలు తెరుస్తారా?
ఇదేమీ రాజ్యం...ఇదేమీ పాలన సిగ్గు.. సిగ్గు..
ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకైన ఖర్చెంత?
స్విస్ ఛాలెంజ్ పేరుతో అనుంగులకు కట్టబెట్టిన భూముల విలువెంత?
రాజధాని పేరుతో లాక్కున్న పచ్చని పొలాలకు కట్టిన వెల ఎంత?

నమ్మిక

కళ్ల ముందు అప్పుడప్పుడు కనిపిస్తావు
కళ్లలో ఎప్పుడూ వుంటావు
మనసు పలవరించినప్పుడు 
లాలనగా పలకరిస్తావు
తనువు పరవశించినప్పుడు
చిరుగాలిలా స్పృశిస్తావు
గుండె దాహార్తితో ఎండిపోయినప్పుడు
ఒయాసిస్సువవుతావు
జీవితంలోని ప్రతి అడుగులోను
తోడు నిలిచే నమ్మికవవుతావు
మనసులోను...
బతుకులోను...
స్వప్నంలోను...
వాస్తవంలోను...
సంతోషంలోను..
బాధలోను...
నన్నల్లుకున్న ఆత్మ నీవు
పెనవేసుకున్న బంధం నీవు
- రాజాబాబు కంచర్ల
24-07-2016

నీ తలపులు చెలమలుగా...

నీ తలపులు మదిలో
చెలమలుగా ప్రవహిస్తుంటే
క్షణాలు నిమిషాలుగా
దినాలు మాసాలుగా
గడిచిపోతుంటే...
మదిలోని నీ రూపం
హృదయమంతా అల్లుకుంటుంటే
భౌతికంగా దూరం ఎంతున్నా..
మానసికంగా అడుగులు వేస్తుంటే
మనస్సులోని నీ స్థానం ఎప్పటికీ పదిలం
నీవిచ్చే స్ఫూర్తి నా నడకకు ఆలంబనం
చివరి శ్వాసవరకూ...
నీ ఆకర్షణలో మునగనీ
నీ ధ్యానంలో పయనించనీ
నీ ప్రేమలో పరవశించనీ
విరహమైనా..ప్రణయమైనా
చెదరని నీ ప్రేమ సాక్షిగా
తుదివరకూ నిలువనీ....
- రాజాబాబు కంచర్ల
18-07-2016

మోయలేని భారం

కవితల్లో నిను చూస్తున్నా...
తలపుల్లో నిను కాస్తున్నా...
ఏం చేయను మరి..
నీవో ఏకాంతవాసివి
నేనో ప్రేమపిపాసిని
వెంటాడే నీ తలపులతో నిదురలేని రాతిరి
వెన్నంటివుండే జ్ఞాపకాలతో గడుపుతున్న ఒంటరి
నీ ఊసుల కోసం ఉవ్విళ్లూరుతోంది మనసు
నీ ఓదార్పు కోసం తహతహలాడుతోంది తనువు
అర్థంకాని చంధస్సులా నువ్వు
పడికట్టు పదాల కూర్పులా నేను
మౌనిలా నువ్వు
యోగిలా నేను
ఇది మోయలేని భారం
ఇది నీడలాంటి వేదనం
- రాజాబాబు కంచర్ల
15-07-2016

ఏ దివిలో విరిసిన పారిజాతమో !

ఏ దివిలో విరిసిన పారిజాతమో !
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో !
నా మదిలో నీవై నిండిపోయెనే..
ఏ దివిలో విరిసిన పారిజాతమో !
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో !
నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల
కాంతి నింపెనే..
|| ఏ దివిలో ||
పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
రాజహంసలా రావే!
|| ఏ దివిలో ||
నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
పదము పదములో మధువులూరగా
కావ్యకన్యవై రావే!
|| ఏ దివిలో ||

సిరిమల్లె పువ్వల్లె నవ్వు.

సిరిమల్లె పువ్వల్లె నవ్వు....చిన్నారి పాపల్లే నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు...చిగురిస్తు ఉండాలి నా నువ్వు..నా నువ్వు..
హ్హ...హ్హ..హ్హ..హ్హ..హ్హ..
సిరిమల్లె పువ్వల్లె నవ్వు...చిన్నారి పాపల్లె నవ్వూ..నవ్వూ
చరణం 1:
ప ని స ...హ్హ..హ్హ...హ్హ...హ్హ..
స గ మ ...హ్హ....హ్హ...హ్హ...
గ మ ప ...ఆ...ఆ..హ్హ...హ్హ..
ని ని ప మ గ గ మ ప
హ్హ ..హ్హ..హ్హ..హ్హ...ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..
చిరుగాలి తరగల్లె మెలమెల్లగా...సెలయేటి నురగల్లె తెలతెల్లగా
చిరుగాలి తరగల్లె మెలమెల్లగా....సెలయేటి నురగల్లె తెలతెల్లగా
చిననాటి కలలల్లె తియతియ్యగా...ఎన్నెన్నో రాగాలు రవళించగా..రవళించగా
ఉహూ..హ్హ..హ్హ..హ్హ..
సిరిమల్లె పువ్వల్లె నవ్వు...చిన్నారి పాపల్లె నవ్వూ... నవ్వూ
చరణం 2:
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా...ఆ వెలుగులో నేను పయనించగా
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా...ఆ వెలుగులో నేను పయనించగా
ఆ....ఆ...ఆ...ఆ...
వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
ఆ....వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
నే మిగిలి ఉంటాను తొలి నవ్వుగా..తొలి నవ్వుగా
సిరి మల్లె పువ్వల్లె నవ్వు...చిన్నారి పాపల్లె నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు...చిగురిస్తు ఉండాలి నా నువ్వు... నా నువ్వు
హ్హ...హ్హ...హ్హ...హ్హ...హ్హ..
సిరిమల్లె పువ్వల్లె నవ్వు... హ్హ..హ్హ..హ్హా..
చిన్నారి పాపల్లె నవ్వూ..హ్హ..హ్హ...హ్హ.

స్వప్నించే కనుల సాక్షిగా...

ఈ గాలి.... నీరు... భూమి.... ఆకాశం...
ఈ ప్రకృతి....
మూగగా స్వప్నించే నా కనుల సాక్షిగా...
ప్రభాతం ప్రకృతి ముంగిట
రంగవల్లులద్దిన వేళ నుండి...
సాయం సంధ్య
నుదుట సిందూరం దిద్దే వరకూ...
స్మృతి సితారలు మీటుతూ...
మది నిండా నీ రూపమే....
అర్థంకాని పదమై
మెదడు నిఘంటువును కలవరపెడతావు
తెరలు తెరలుగా ఎగసిపడే అనుభూతి కెరటాలు
ఎద ఒడ్డును తాకి తాకి వెళుతుంటే....
మనసు పడే ఆరాటం చెప్పడానికి
అక్షరాలు కరువవుతున్నాయి..
అందుకే...
నా మనసు పుస్తకాన్ని
నీ చెవిలో వినిపిస్తా...
నా స్వప్నపు పుష్పాన్ని
నీ చరణాల ముందు పరుస్తా...
పిచ్చివాణ్ణనుకుంటే పట్టించుకోకు...
ఆరాధకుణ్ణనుకుంటే...
నా ప్రేమను గుర్తించూ....
చాలు బంగారం...
ఈ జన్మకది చాలు...
- రాజాబాబు కంచర్ల
18-04-2016

ప్రేమికుడు

నన్నెందుకు అంతలా కదిలించావు
తాకితే పగిలిపోయే గాజు పాత్రలా మార్చావు
నిండుకున్న పాత్రను నీ ప్రేమామృతంతో నింపావు
నీ మధుర స్వరంతో కోయిల గీతాలాలపిస్తావు
ఈ చిన్ని గుండెలో ఆనందం నింపుతావు
ఎన్ని యుగాలైనా మధురంగా ఆలపిస్తూనే వుంటావు
సేవించేకొద్దీ ప్రేమామృతాన్ని నింపుతూనే వుంటావు
అనుభవించేకొద్దీ ఈ గుండె నిండా ఆనందాన్ని నింపుతావు
ఇంతటి ప్రేమాస్పదమైన నీకు.. నేనేమీయగలను
నీ గానానికి వేణువుగా
నీ గాయానికి ఔషధంగా
నీ గతానికి భవిష్యత్తుగా
నీ మౌనానికి ఓదార్పుగా
నీ భవిష్యత్తుకు వారధిగా
నీ ప్రేమకు దాసునిగా
నిత్యం నిన్నారాధించే ప్రేమికుడిగా తప్ప...
- రాజాబాబు కంచర్ల
04-07-2016

నీకెలా తెలుపను..

రాతి గుండెను మీటి
రాగాలు పలికించిన
రాగమయి నీవని
నీకెలా తెలుపను...
నీ పరిచయంతో
శిల శిల్పంగా మారిన వైనాన్ని
నీకెలా తెలుపను...
యాంత్రికమైన జీవితంలోకి
పిల్లతెమ్మెరలా వచ్చి
మల్లెల సుగంధాలు పూయిస్తున్నావని
నీకెలా తెలుపను...
నీతో మాట్లాడే ప్రతిక్షణం
నీ ప్రేమలో నేను పొందే అమరసౌఖ్యమని
నీకెలా తెలుపను...
నీకోసం చేసే ప్రతి పనిలో
నేననుభవించే ఆనందాతిశయాన్ని
నీకెలా తెలుపను...
కళ్లు మూస్తే ఎక్కడ కరిగిపోతావోనని
నిద్రలేని రాత్రులు గడిపే కనురెప్పల స్థితిని
నీకెలా తెలుపను...
నా ఎద లోగిలికి స్వాగతం పలుకుతూ
నీ అడుగుల సవ్వడి కోసం నిరీక్షిస్తున్నానని
నీకెలా తెలుపను...
- రాజాబాబు కంచర్ల
03-07-2016

అయితేనేం...

నిద్రలేని రాత్రిని మిగిల్చావు
అయితేనేం...
నువు నాతోనే వున్నావుగా
నీ పండువెన్నెల్లాంటి నీ ప్రేమలో మునిగితేలాను
నీ ప్రేమలోని హాయిని తనివితీరా అనుభవించాను
- రాజాబాబు కంచర్ల
03-07-2016

అవాక్కవ్వాలి.



నేనెప్పుడైనా గుర్తొస్తే...
మలయమారుతం గుర్తుకు రావాలి
పండువెన్నెల గుర్తుకు రావాలి
నా ప్రేమ గుర్తుకు రావాలి
ఒక మనిషిని ఎవరైనా ఇంతగా ప్రేమిస్తారా.. అని
నువ్వు అవాక్కవ్వాలి...
నా ప్రేమలో తలమునకలవ్వాలి..
- రాజాబాబు కంచర్ల
01-07-2016

పూలపాన్పు

కోమలమైన నీ పాదాలు కందకుండా
పూలపాన్పునవుతా
సువాసనల పారాణినద్దుతా
నిను వీడని వలపునవుతా
నీ ప్రేమనవుతా....
- రాజాబాబు కంచర్ల
june 28, 2016