16, మే 2016, సోమవారం

నిరీక్షిస్తున్నా నీకోసం ..

ఓ మేఘమాలికలారా...
తనను చూడనిదే ఉండలేదు మనసు.. క్షణమైనా
మది తన వైపే లాగుతోంది... పదేపదే
ఎద నిండా తన రూపమే పరచుకొనివుందని
హేమంత తుషారంలా చల్లగా చెప్పరాదా
ప్రియురాలి ముంగురులను మెల్లగా తాకి

తన తలపుల పానుపుపై
వాసంత సమీరంలా శయనిస్తానని
తన మమతల కోవెలలో
నను పదిలముగా దాచుకొమ్మని
ఈ చిన్ని గుండెలో శ్రావణమేఘమై
ప్రేమ తుషారాలు చిలికించమని
శరచ్ఛంద్రికలా నచ్చజెప్పిరావా
క్షణాలు యుగాలుగా మారుతున్న వేళ
నిరీక్షిస్తున్నా... అనురాగమై చుట్టేయాలని

- రాజాబాబు కంచర్ల
16-05-2016

14, మే 2016, శనివారం

మనసుతో ప్రేమిస్తాను


నేను
మెదడుతో కానీ...
హృదయంతో కానీ ప్రేమించను
హృదయం ఆగిపోవచ్చు...
మెదడు మరిచిపోవచ్చు...
అందుకే...
మనసుతో ప్రేమిస్తాను
మనసు ఆగిపోదు...
మరిచిపోదు...

రంగు చూసో..
అందం చూసో..
ఆకారం చూసో ప్రేమించను
రంగు మాసిపోవచ్చు...
అందం తరిగిపోవచ్చు...
ఆకారం సుష్కించిపోవచ్చు..
అందుకే...
వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తాను
అంతరంగాన్ని ఆరాధిస్తాను
వ్యక్తిత్వం ఎప్పటికీ వాడిపోదు...
అంతరంగం ఎప్పటికీ సుష్కించిపోదు...

- రాజాబాబు కంచర్ల
14-05-2016

12, మే 2016, గురువారం

ఎన్నెన్ని కోరికలో

కనులముందు నీవుంటే
ఎన్నెన్ని భావాలో
నీ చల్లని మదిలో చోటిస్తే
ఎన్నెన్ని రాగాలో
నీ వాలు కనులు చెప్పెనులే
ఎన్నెన్ని అర్థాలో
నీ వలపుల వడిలో పవళిస్తే
ఎన్నెన్ని కోరికలో
మన ఇద్దరి కలయికతోటే
ఎన్నెన్ని వాసంత సమీరాలో

-రాజాబాబు కంచర్ల
13-05-2016

మమతే నీవుగా..

ఉండాలీ నా ఎదలో.. మమతే నీవుగా
నిండాలీ నా కనులలో.. వెలుగే నీవుగా
ఉండాలీ జన్మజన్మలకు నా తోడే నీవై
నిండాలీ మనసునిండుగా నా చెలి నీవై

పున్నమి వెలుగుల్లా వెన్నెల సుధలు చిలికించవా
చిరుగాలి కెరటాల్లా మనసు వీణలు పలికించవా
జవరాలి పయ్యదలా మదిలో చిగురాశలే ఊరించగా
చెలికాని హృదయంలో విరి తేనియలే ఒలికించవా

ఉంటాను నీ తలపులలో వాడిపోని చిరునవ్వుగా
ఉంటాను నీ మనసు కోవెలలో చిరు వెలుగుగా
ఉంటాను నీ అడుగులలో అడుగునై చివరిదాకా
ఉంటాను నీ జతగా జన్మజన్మలకు వీడనితోడుగా

- రాజాబాబు కంచర్ల
12-05-2016

18వ రోజు

ప్రియమైన మేఘమాలా..

నీవు వెళ్లిన తర్వాత పూదోట బావురుమంటోంది.
నీ ఆలోచనలతో  మనసు వికలమౌతోంది.
ఏ పనిపైనా ఏకాగ్రత పెట్టలేకపోతున్నా.
కనీసం పుస్తకాలు కూడా చదవలేని పరిస్థతి.
ఆ ఆలోచనల నుండి బయట పడదామని
విశ్వ ప్రయత్నం చేశా..
అందులో భాగంగానే నీకు ఉత్తరాలు రాయలేకపోయా.
కానీ నా ప్రయత్నం విఫలమైంది..
మదినిండా నువ్వే ఉన్నప్పుడు
స్వప్నంలోనూ నువ్వే ఉన్నప్పుడు
ఎదలోని భావాలను రాయకుండా వుండలేక
ఇక్కడ ఏవేవో అక్షరాలను పేర్చుతున్నా...
రాత్రి ఓ భయంకరమైన కల...
ఆ కలలో మనిద్దరికీ ఢిష్యూం ఢిష్యూం...
మనిద్దరి మధ్య ఏదో గొడవ...
కలలో కూడా ఊహించలేని  ఈ సంఘటనతో
మళ్లీ ఉత్తరం రాయమని మనసు పోరుతోంది
నా కనులలో వెలుగై... నా ఎదలో మమతై..
నా జీవితంలో మహారాణివై..మంచి స్నేహితవై
తోడుండవా...

నీ జ్ఞాపకలతో

18వ రోజు
12-05-2016

6, మే 2016, శుక్రవారం

11వ రోజు

నా ప్రియమైన మేఘమాలా...

నీకు ఉత్తరం రాసి నాలుగురోజులైపోయింది.
వెళుతూ వెళుతూ నా శక్తినంతా నువ్వు గుంజుకుపోయావేమో..
నిస్సత్తువగా మిగిలా నేను..
ఏ పనీ చేయలేకపోతున్నా...
కళ్లుమూసినా.. తెరచినా.. నీ రూపమే.
నా సమయమంతా నన్ను నేను ఓదార్చుకోడానికే ..
నీ చిత్తరువును చూస్తూ...
నిమిషాలను గంటల్లా... గంటలను రోజుల్లా గడిపేస్తున్నా..
ఇది రాస్తుంటే... ఏదో సినిమాలో పాట లీలగా వినిపిస్తోంది..
‘‘నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది నిలిచందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా
నిముషాలు శూలాలై వెంటాడుతున్నా
ఒడి చేర్చుకోవా వయ్యారి
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా
ఓదార్చిపోవా ఓ సారి...’’
నా పరిస్థితీ అలాగే వుంది బంగారం.
తనువంతా కళ్లు చేసుకొని ఎదురుచూస్తున్నా..
నిను చూసే క్షణం కోసం.
కాలం ఎంత కఠినమైనదీ...
రోజులు ఎంత నెమ్మదిగా జరుగుతున్నవో కధా
నువ్వు ఎప్పుడెప్పుడొస్తావో అని
ఇప్పటినుంచే రెడీ అవుతున్నా...
ఎంతుకలా నవ్వుతావు బంగారం
నువ్వలా కొంటెగా నవ్వితే
అలా హస్కీగా మాట్లాడితే
నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను సుమా...

నీ జ్ఞాపకాలతో

11వ రోజు
05-05-2016


వీడిపోనంటూ బాసలు చేసి

విరిసిన హరివిల్లే నీ వదనం
మమతల విరిజల్లే నా హృదయం
నీ సన్నిధి ప్రతి క్షణం ఓ వసంతం
నా ఎదలో సముద్రమై పొంగే సంతోషం


నీ స్పర్శతో పరవశమేదో రగులుతువుంటే
ఏదో వింతలు ఎదలో చేరి సరిగమలే పలుకుతువుంటే
తెరచాటు సంకోచాలే సడలుతువుంటే
జన్మజన్మలకీ ఇదే ప్రేమను వాంఛిస్తున్నా
మనసులోని కోరికకే బలముంటే

వీడిపోనంటూ మనసుబాసలు చేసి
వలపుల రాణివై మనసుకు బంధం వేశావు
మదిలోని రంగుల కలను నిజం చేసి
నా చిన్ని ప్రపంచాన్ని రసమయం చేశావు

- రాజాబాబు కంచర్ల
05-05-2016