పల్లవి:
ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...
ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఆ..ఆ... ఆ
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో.. ఆ .. ఆ.. ఆ..
రవి చూడని.. పాడని.. నవ్యనాదానివో...
రవివర్మకే... ఆ .. ఆ.. అందని... ఆ .. ఆ.. ఒకే ఒక అందానివో...
చరణం 1:
ఏ రాగమో.. తీగదాటి ఒంటిగా నిలిచే
ఏ యొగమో.. నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగభావాలో.. అనురాగ యోగాలై....
ఆ.. ఆ... ఆ.. ఆ... ఆ.. ఆ
నీ పాటలే పాడనీ..
రవివర్మకే... ఆ .. ఆ.. ఆ.. అందని... ఆ .. ఆ.. ఆ.. ఒకే ఒక అందానివో...
చరణం 2:
ఏ గగనమో కురులు జారి.. నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి.. కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే.. నీ దివ్య శిల్పాలై
ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...
కదలాడనీ.. పాడనీ..
రవివర్మకే... అందని.. ఒకే ఒక అందానివో...
ఆ .. ఆ.. ఆ....
రవి చూడని.. పాడని.. నవ్యనాదానివో...
రవివర్మకే.. ఆ.. ఆ... అందని.. ఆ.. ఆ...
ఒకే ఒక అందానివో...
చిత్రం : రావణుడే రాముడైతే ( 1979)
సంగీతం : జి.కె. వెంకటేశ్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి