30, నవంబర్ 2016, బుధవారం

ఎదలో ఉన్నది ఆలయము

01.
ఎదలో ఉన్నది ఆలయము
అది ఓ దేవత మందిరము
తానులేని నాడదో శిధిలాలయము

మాతృభాషకు పట్టం

తెలుగు భాషకు ప్రాచీన హోదా కిరీటం
ఇది తెలుగు జాతికి మకుటాయమానం
మాతృభాషకు పట్టం కడదాం
కొనఊపిరితో బతుకీడుస్తున్న తేటతెనుగును బతికించుకుందాం
ఇపుడైనా ఏలికలకు కలిగేనా జ్ఞానోదయం
ఇకనైనా వర్థిల్లేనా తెలుగు భాషావికాసం
నిర్మాణాత్మక దిశగా అడుగులు వేద్దాం
దశదిశలా తెలుగు వెలుగులు వ్యాపింపజేద్దాం
***
తెలుగు భాషకు ప్రాచీన హోదాపై దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. 2008 అక్టోబర్ 31న కేంద్ర ప్రభుత్వం అతి
ప్రాచీన భాషల్లో తెలుగును చేర్చింది. అయితే, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా భాషలకు ప్రాచీన హోదా
కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ 2009లో మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కాగా, తెలుగుతోపాటు కన్నడ,
మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా అర్హత ఉందని మద్రాసు హైకోర్టు సోమవారం (08-08-2016) తేల్చి
చెప్పింది. తెలుగును ఆధునిక భాషగా గుర్తించడంతో పాటు ప్రపంచ భాషగా మార్చేందుకు రెండు తెలుగు ప్రభుత్వాలు కృషి
చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
- రాజాబాబు కంచర్ల
08-08-2016

న్యూనతాభావం

మనసులోని భావాలు 
వెల్లువల ఉప్పొంగుతుంటే..
వ్యక్తీకరించడానికి 
అడ్డొస్తున్నదేదో న్యూనతాభావం
ఎవరికోసమే
మనసులోని భావాలను అదిమిపెడితే..
మాటల రూపంలోనో...
అక్షరాల రూపంలోనో బయటకు రావాలి
ఇంకా మిగిలివుంటే
కన్నీరై కారిపోవాలి
అప్పుడే...
బరువు దిగుతుంది
గుండె సేదతీరుతుంది
- రాజాబాబు కంచర్ల
08-08-2016

చైతన్యం నింపే కవితా జ్యోతులు

ఈ కవితా సంపుటిలోని ప్రతి అక్షరం అంబేద్కర్‌ భావజాలపు వెలుగులో చైతన్య కిరణం. ఈ కవితా సంపుటి సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్షలపై సంధించిన అక్షర తూణీరం. దళితుల ఐక్యత, ఆత్మాభిమానం, సామాజిక న్యాయం, రాజ్యాధికారం వంటి అంశాలపై కవి హృదయ స్పందనే ఈ కవితా సంపుటి. రచయిత చింతా అప్పారావు ఆంగ్ల భాషా అధ్యాపకులైనప్పటికీ సరళమైన భాషలో వ్యవస్థలోని లొసుగుల ముసుగుల్ని తొలగించి, వ్యవస్థ స్వరూపాన్ని, ఆయా వర్గాల భావోద్వేగాలను స్పష్టంగా, నిర్మొహమాటంగా వెల్లడించారు. 'చైతన్య జ్యోతులు' అనే

తెలిసిపోయింది

తెలిసిపోయింది ‘హోదా’కి అడ్డెవరో
నిరసనలు తెలిపేవారిని
లాఠీలతో బాదించి
వ్యాన్లలోకి ఈడ్పించి
మహిళల తాళిబొట్టు తెంపించి
కర్కోటకంగా వ్యవహరించి
అభినవ ‘నీరో’నని
మళ్లీ మళ్లీ రుజువు చేసుకొంటున్నదెవరో
తెలిసిపోయింది...
హోదాకు అడ్డెవరో తెలిసింది...
గజదొంగను సంకలో పెట్టుకొని
ఎదుటివారిపై నిందలు మోపి
సిసలైన నీతిమంతుడ్నని గప్పాలు కొట్టి
పచ్చమీడియాతో డబ్బా కొట్టించుకొని
తోకముడిచే బడాబాబుల బండారం
బట్టబయలయింది..
హోదాకు అడ్డెవరో తెలిసిపోయింది...
హోదా సంజీవని కాదు...
సింగపూర్ తరహా రాజధానులు
కజకిస్తాన్ తరహా భవంతులు
జపాన్ తరహా నిరసనలు
ఇక ఆంధ్రుల సంస్కృతికి కాలంచెల్లు
ఇవే బాబుగారి గీతోపదేశాలు
అందరికీ తేటతెల్లం అయింది
హోదాకు అడ్డెవరో తెలిసిపోయింది
ప్రత్యేక హోదా మన హక్కు
ఆంధ్రుడా చెయ్యి చెయ్యి కలుపు
దూసుకొంటూ..తోసుకొంటూ...
మన హక్కును నినదిస్తూ..
జగన్నాథ రథచక్రాలై
పోదాం...పోదాం.. మునుముందుకు...
- రాజాబాబు కంచర్ల
03-08-2016

ఎద లోగిలి

ఎద లోగిలిలో తీర్చిదిద్దిన రంగవల్లివీవు
కను దోయలలో దాగున్న స్వప్నికవీవు
మది ఊహలలో విరిసిన రంగుల హరివిల్లువీవు
అణువణువునా ప్రవహించే ప్రేమధార నీవు
హృది లోయలలో దాగిన భావాలను రగిలిగించిన చైతన్యమీవు
నేస్తమై మనసు దోచిన సౌందర్యవల్లివీవు
నీవులేని నేను...
శృతితప్పిన పల్లవిని
మూగబోయిన గేయాన్ని
రంగు వెలసిన చిత్రాన్ని
అర్థంలేని పద్యాన్ని
దేవతలేని నిలయాన్ని
శిథిలమైన ఆలయాన్ని
- రాజాబాబు కంచర్ల
31-07-2016

ఓ చెలియా నా ప్రియ సఖియా

ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుందని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవసమై ఇరు కన్నులు సోలెనులే
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
ఈపూట చెలి నా మాట ఇక కరువైపోయెనులే
ఆధారము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో అర క్షణమొక యుగమేలే
చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయెనులే
ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే
ఈ జీవికి జీవన మరణమూ నీ చేతిలో ఉన్నదిలే
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
కోకిలమ్మ నువ్వు సై అంటే నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకొని సవరించేను నీ కురులే
వెన్నెలమ్మ నీకు జోల పాడి కాలి మెటికెలు విరిచేనే
నీ చేతి చలి గాలులకు తేరా చాపి నిలిచేనే
నా ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే
నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే

గతాన్ని మరిచారా...?

వసతి గృహాల మూసివేతపై గళమిప్పితే..
కర్కశంగా గొంతు నులుముతారా?
మెస్‌ ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తే
మెడకు చున్నీలు చుట్టి అమానుషంగా ఈడ్చుతారా?
ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ..
కార్పొరేట్ స్కూళ్లకు ద్వారాలు తెరుస్తారా?
ఇదేమీ రాజ్యం...ఇదేమీ పాలన సిగ్గు.. సిగ్గు..
ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకైన ఖర్చెంత?
స్విస్ ఛాలెంజ్ పేరుతో అనుంగులకు కట్టబెట్టిన భూముల విలువెంత?
రాజధాని పేరుతో లాక్కున్న పచ్చని పొలాలకు కట్టిన వెల ఎంత?

నమ్మిక

కళ్ల ముందు అప్పుడప్పుడు కనిపిస్తావు
కళ్లలో ఎప్పుడూ వుంటావు
మనసు పలవరించినప్పుడు 
లాలనగా పలకరిస్తావు
తనువు పరవశించినప్పుడు
చిరుగాలిలా స్పృశిస్తావు
గుండె దాహార్తితో ఎండిపోయినప్పుడు
ఒయాసిస్సువవుతావు
జీవితంలోని ప్రతి అడుగులోను
తోడు నిలిచే నమ్మికవవుతావు
మనసులోను...
బతుకులోను...
స్వప్నంలోను...
వాస్తవంలోను...
సంతోషంలోను..
బాధలోను...
నన్నల్లుకున్న ఆత్మ నీవు
పెనవేసుకున్న బంధం నీవు
- రాజాబాబు కంచర్ల
24-07-2016

నీ తలపులు చెలమలుగా...

నీ తలపులు మదిలో
చెలమలుగా ప్రవహిస్తుంటే
క్షణాలు నిమిషాలుగా
దినాలు మాసాలుగా
గడిచిపోతుంటే...
మదిలోని నీ రూపం
హృదయమంతా అల్లుకుంటుంటే
భౌతికంగా దూరం ఎంతున్నా..
మానసికంగా అడుగులు వేస్తుంటే
మనస్సులోని నీ స్థానం ఎప్పటికీ పదిలం
నీవిచ్చే స్ఫూర్తి నా నడకకు ఆలంబనం
చివరి శ్వాసవరకూ...
నీ ఆకర్షణలో మునగనీ
నీ ధ్యానంలో పయనించనీ
నీ ప్రేమలో పరవశించనీ
విరహమైనా..ప్రణయమైనా
చెదరని నీ ప్రేమ సాక్షిగా
తుదివరకూ నిలువనీ....
- రాజాబాబు కంచర్ల
18-07-2016

మోయలేని భారం

కవితల్లో నిను చూస్తున్నా...
తలపుల్లో నిను కాస్తున్నా...
ఏం చేయను మరి..
నీవో ఏకాంతవాసివి
నేనో ప్రేమపిపాసిని
వెంటాడే నీ తలపులతో నిదురలేని రాతిరి
వెన్నంటివుండే జ్ఞాపకాలతో గడుపుతున్న ఒంటరి
నీ ఊసుల కోసం ఉవ్విళ్లూరుతోంది మనసు
నీ ఓదార్పు కోసం తహతహలాడుతోంది తనువు
అర్థంకాని చంధస్సులా నువ్వు
పడికట్టు పదాల కూర్పులా నేను
మౌనిలా నువ్వు
యోగిలా నేను
ఇది మోయలేని భారం
ఇది నీడలాంటి వేదనం
- రాజాబాబు కంచర్ల
15-07-2016

ఏ దివిలో విరిసిన పారిజాతమో !

ఏ దివిలో విరిసిన పారిజాతమో !
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో !
నా మదిలో నీవై నిండిపోయెనే..
ఏ దివిలో విరిసిన పారిజాతమో !
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో !
నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల
కాంతి నింపెనే..
|| ఏ దివిలో ||
పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
రాజహంసలా రావే!
|| ఏ దివిలో ||
నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
పదము పదములో మధువులూరగా
కావ్యకన్యవై రావే!
|| ఏ దివిలో ||

సిరిమల్లె పువ్వల్లె నవ్వు.

సిరిమల్లె పువ్వల్లె నవ్వు....చిన్నారి పాపల్లే నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు...చిగురిస్తు ఉండాలి నా నువ్వు..నా నువ్వు..
హ్హ...హ్హ..హ్హ..హ్హ..హ్హ..
సిరిమల్లె పువ్వల్లె నవ్వు...చిన్నారి పాపల్లె నవ్వూ..నవ్వూ
చరణం 1:
ప ని స ...హ్హ..హ్హ...హ్హ...హ్హ..
స గ మ ...హ్హ....హ్హ...హ్హ...
గ మ ప ...ఆ...ఆ..హ్హ...హ్హ..
ని ని ప మ గ గ మ ప
హ్హ ..హ్హ..హ్హ..హ్హ...ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..
చిరుగాలి తరగల్లె మెలమెల్లగా...సెలయేటి నురగల్లె తెలతెల్లగా
చిరుగాలి తరగల్లె మెలమెల్లగా....సెలయేటి నురగల్లె తెలతెల్లగా
చిననాటి కలలల్లె తియతియ్యగా...ఎన్నెన్నో రాగాలు రవళించగా..రవళించగా
ఉహూ..హ్హ..హ్హ..హ్హ..
సిరిమల్లె పువ్వల్లె నవ్వు...చిన్నారి పాపల్లె నవ్వూ... నవ్వూ
చరణం 2:
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా...ఆ వెలుగులో నేను పయనించగా
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా...ఆ వెలుగులో నేను పయనించగా
ఆ....ఆ...ఆ...ఆ...
వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
ఆ....వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
నే మిగిలి ఉంటాను తొలి నవ్వుగా..తొలి నవ్వుగా
సిరి మల్లె పువ్వల్లె నవ్వు...చిన్నారి పాపల్లె నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు...చిగురిస్తు ఉండాలి నా నువ్వు... నా నువ్వు
హ్హ...హ్హ...హ్హ...హ్హ...హ్హ..
సిరిమల్లె పువ్వల్లె నవ్వు... హ్హ..హ్హ..హ్హా..
చిన్నారి పాపల్లె నవ్వూ..హ్హ..హ్హ...హ్హ.

స్వప్నించే కనుల సాక్షిగా...

ఈ గాలి.... నీరు... భూమి.... ఆకాశం...
ఈ ప్రకృతి....
మూగగా స్వప్నించే నా కనుల సాక్షిగా...
ప్రభాతం ప్రకృతి ముంగిట
రంగవల్లులద్దిన వేళ నుండి...
సాయం సంధ్య
నుదుట సిందూరం దిద్దే వరకూ...
స్మృతి సితారలు మీటుతూ...
మది నిండా నీ రూపమే....
అర్థంకాని పదమై
మెదడు నిఘంటువును కలవరపెడతావు
తెరలు తెరలుగా ఎగసిపడే అనుభూతి కెరటాలు
ఎద ఒడ్డును తాకి తాకి వెళుతుంటే....
మనసు పడే ఆరాటం చెప్పడానికి
అక్షరాలు కరువవుతున్నాయి..
అందుకే...
నా మనసు పుస్తకాన్ని
నీ చెవిలో వినిపిస్తా...
నా స్వప్నపు పుష్పాన్ని
నీ చరణాల ముందు పరుస్తా...
పిచ్చివాణ్ణనుకుంటే పట్టించుకోకు...
ఆరాధకుణ్ణనుకుంటే...
నా ప్రేమను గుర్తించూ....
చాలు బంగారం...
ఈ జన్మకది చాలు...
- రాజాబాబు కంచర్ల
18-04-2016

ప్రేమికుడు

నన్నెందుకు అంతలా కదిలించావు
తాకితే పగిలిపోయే గాజు పాత్రలా మార్చావు
నిండుకున్న పాత్రను నీ ప్రేమామృతంతో నింపావు
నీ మధుర స్వరంతో కోయిల గీతాలాలపిస్తావు
ఈ చిన్ని గుండెలో ఆనందం నింపుతావు
ఎన్ని యుగాలైనా మధురంగా ఆలపిస్తూనే వుంటావు
సేవించేకొద్దీ ప్రేమామృతాన్ని నింపుతూనే వుంటావు
అనుభవించేకొద్దీ ఈ గుండె నిండా ఆనందాన్ని నింపుతావు
ఇంతటి ప్రేమాస్పదమైన నీకు.. నేనేమీయగలను
నీ గానానికి వేణువుగా
నీ గాయానికి ఔషధంగా
నీ గతానికి భవిష్యత్తుగా
నీ మౌనానికి ఓదార్పుగా
నీ భవిష్యత్తుకు వారధిగా
నీ ప్రేమకు దాసునిగా
నిత్యం నిన్నారాధించే ప్రేమికుడిగా తప్ప...
- రాజాబాబు కంచర్ల
04-07-2016

నీకెలా తెలుపను..

రాతి గుండెను మీటి
రాగాలు పలికించిన
రాగమయి నీవని
నీకెలా తెలుపను...
నీ పరిచయంతో
శిల శిల్పంగా మారిన వైనాన్ని
నీకెలా తెలుపను...
యాంత్రికమైన జీవితంలోకి
పిల్లతెమ్మెరలా వచ్చి
మల్లెల సుగంధాలు పూయిస్తున్నావని
నీకెలా తెలుపను...
నీతో మాట్లాడే ప్రతిక్షణం
నీ ప్రేమలో నేను పొందే అమరసౌఖ్యమని
నీకెలా తెలుపను...
నీకోసం చేసే ప్రతి పనిలో
నేననుభవించే ఆనందాతిశయాన్ని
నీకెలా తెలుపను...
కళ్లు మూస్తే ఎక్కడ కరిగిపోతావోనని
నిద్రలేని రాత్రులు గడిపే కనురెప్పల స్థితిని
నీకెలా తెలుపను...
నా ఎద లోగిలికి స్వాగతం పలుకుతూ
నీ అడుగుల సవ్వడి కోసం నిరీక్షిస్తున్నానని
నీకెలా తెలుపను...
- రాజాబాబు కంచర్ల
03-07-2016

అయితేనేం...

నిద్రలేని రాత్రిని మిగిల్చావు
అయితేనేం...
నువు నాతోనే వున్నావుగా
నీ పండువెన్నెల్లాంటి నీ ప్రేమలో మునిగితేలాను
నీ ప్రేమలోని హాయిని తనివితీరా అనుభవించాను
- రాజాబాబు కంచర్ల
03-07-2016

అవాక్కవ్వాలి.



నేనెప్పుడైనా గుర్తొస్తే...
మలయమారుతం గుర్తుకు రావాలి
పండువెన్నెల గుర్తుకు రావాలి
నా ప్రేమ గుర్తుకు రావాలి
ఒక మనిషిని ఎవరైనా ఇంతగా ప్రేమిస్తారా.. అని
నువ్వు అవాక్కవ్వాలి...
నా ప్రేమలో తలమునకలవ్వాలి..
- రాజాబాబు కంచర్ల
01-07-2016

పూలపాన్పు

కోమలమైన నీ పాదాలు కందకుండా
పూలపాన్పునవుతా
సువాసనల పారాణినద్దుతా
నిను వీడని వలపునవుతా
నీ ప్రేమనవుతా....
- రాజాబాబు కంచర్ల
june 28, 2016

మరుమల్లెపూవు



నా పేరు మరుమల్లెపూవు
నా మనసు తెలుపు
నా రూపు తెలుపు
నా తనువు తెలుపు
తల్లి తీగన విరగబూస్తా
నేల రాలేవరకు పరిమళాలు విరజిమ్ముతా
నేల రాలి నీ పాదాల కింద నలుగుతా
నువు నడిచే దారిలో పూలబాటనవుతా
కోమలమైన నీ పాదాలు కందకుండా పూలపాన్పునవుతా
నీ పాదాల కింద నలిగినా...
సువాసనల పారాణినద్దుతా
భూమిలో కలసి పోయే వరకూ...
నిను వీడని వలపునవుతా
నీ ప్రేమనవుతా....
- రాజాబాబు కంచర్ల
27-06-2016

రవీంద్రనాథ్ ఠాగూర్ ‘‘వనమాలి’’ -39

పూలతో ఓ మాల నల్లాలని ఉదయమంతా చూశాను
కాని పువ్వులు జారిపడిపోయాయి
వెతికే నీ కళ్ల కొనలనించి, నన్ను రహస్యంగా చూస్తూ కూచుంటావు
రహస్యంగా అల్లరి ఎత్తులు వేసే ఆ కళ్లని అడుగు ఎవరి తప్పో అది.
నేను పాట పాడదామని ప్రయత్నించాను, కానీ చేతకాలేదు.
నేనెందుకు పాడలేకపోయానో
నీ పెదిమల మీద దాక్కుని దోబూచులాడే చిరునవ్వుని అడుగు.
పద్యంలోని మత్తెక్కిన మధుపం వలె
నా కంఠస్వరం, నిశ్శబ్దంలో ఎట్లా ఇంకిపోయిందో
నీ చిరునవ్వే పెదవుల్ని ప్రమాణం చేసి చెప్పమను.
సాయంత్రమయింది... పుష్పాలు ముకుళించుకునే సమయమయింది.
నీ పక్కన కూచుని నక్షత్రాల మసక వెలుతురులో,
నిశ్శబ్దంలో చెయ్యడానికి వీలయ్యే దానిని నా పెదవుల్ని చెయ్యమని ఆజ్ఞాపించు
---------------------------------------------------------------
రవీంద్రనాథ్ ఠాగూర్ ‘‘వనమాలి’’ -39, అనువాదం : చలం

ఎస్.వి. ఇంజనీరింగ్ కాలేజీ, తిరుపతి



ఎస్.వి. ఇంజనీరింగ్ కాలేజీ, తిరుపతి
19-06-2016

29, నవంబర్ 2016, మంగళవారం

తడియారని గురుతులు

నువ్వు నన్ను వీడిందిలేదు
నీ జ్ఞాపకాలన్నీ సజీవ దృశ్యాలు
నిన్ను నేను మరచింది లేదు
నీ బాసలన్నీ తడియారని గురుతులు
- రాజాబాబు కంచర్ల
22-06-2016

మతోన్మాద ముద్ర

ప్రార్థించే పెదవుల కన్నా
సాయం చేసే చేతులు మిన్న
ఇవి మదర్ థెరిస్సా మాటలు
సేవ ముసుగులో మత మార్పిడులు
అంటూ బిజెపి నేతల విషపు కూతలు
మతాతీత సేవాతత్పరత మదర్ తత్వం
మతోన్మాద కాషాయీకరణ బిజెపి నైజం
త్యాగమయికి మతోన్మాద ముద్ర
ఇది మసీదును కూల్చిన కింకరుల కుట్ర
- రాజాబాబు కంచర్ల
21-06-2016

నీకు తెలుసో లేదో..

నీకు తెలుసో లేదో..
నీ కళ్లలోకి చూస్తే
నన్ను నేను మర్చిపోతా..
నీకు తెలుసో లేదో...
నీ మాటలు వింటుంటే
తెలియని మైకమేదో ఆవహిస్తుంది
నీకు తెలుసో లేదో...
నిను తాకిన అనుభవం క్షణకాలమే
నే పొందిన అనుభూతి జీవితకాలం
నీకు తెలుసో లేదో...
నీతో గడిపిన క్షణాలు కొద్దే
అయినా..ఏదో విడదీయలేని అనుబంధం
నాకు తెలుసు నీ మనసులో ఏముందో
- రాజాబాబు కంచర్ల
20-06-2016

మహాకవికి అక్షర నివాళి

ఈ శతాబ్దం నాదియని ప్రకటించుకున్న మహాకవి యాతడు
ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక విరాట్‌ స్వరూపమాతడు
కొత్త తరంతో కలిసి నడవాలని యత్నించిన నవయుగ వైతాళికుడాతడు
తన మరణానంతరమూ బతికేయున్న సామాజిక సంచలనమాతడు
కవిత్వ యుగాన్నే నడిపిన నడిపిస్తున్న అమరజీవియాతడు
ఆయనే మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)...
నా దారి రహదారి అన్నట్టుగా ఆయన ఒక ప్రజాబాటను ఏర్పరిచాడు.
తెలుగు సాహిత్యంలో స్తబ్థతను భగ్నం చేసి ఒక నవీన స్ఫూర్తిని అద్దాడు.
ఆ మహాకవి భావాల్లో, భాషలో, కదలికలో, అక్షరాల్లో ఆధునిక తెలుగు సాహిత్యానికి
ఆయనందించిన స్ఫూర్తీ, కీర్తి సజీవం.
శ్రీశ్రీ కవిత్వాన్ని అనుభవించి పలవరించడమే తప్ప.... దానికి ఏ తూనికలూ లేవు.
ఆ మహాకవికి ఘన నివాళి... నా అక్షరాంజలి
(శ్రీశ్రీ వర్థంతి (జూన్ 15, 1983) సందర్భంగా...)
- రాజాబాబు కంచర్ల
15-06-2016

ప్రేమ పాత్ర


నీ ప్రేమసాగరంలో మునకలేసి
రెక్కలల్లార్చుతున్న నా
హృదయ విహంగపు రెక్కలకు
నీ హృదయ దారాలను పేనవేసేయ్
ప్రతిక్షణం నీ ప్రేమ గానం వింటున్న
ప్రతిరేయి నీ ప్రేమ సుధలో తడుస్తున్న
ప్రతినిత్యం నీ ప్రేమ సుగంధం ఆస్వాదిస్తున్న
నా హృదయాన్ని నీ ప్రేమబంధంతో ముడివేసేయ్
నా హృదయాన్ని పిండి నీ ప్రేమ పాత్ర నింపా
అది గట్టిపడి ఓ సుందరాకృతిని దాల్చింది
నా ప్రేమనంతా రంగరించి ఊపిరిలూదా
అది సజీవాకృతిగా మారిన నీ సుందరరూపమయింది
- రాజాబాబు కంచర్ల
15-06-2016

స్వాగతం ప్రియతమా

అందాల సరిమల్లె పువ్వా..
అధరాన మెరిసేటి నవ్వా..
ఎదలోన దాగున్న గువ్వా..
స్వాగతం ప్రియతమా
నిను మరచిందిలేదు
నువు నను వీడిందిలేదు
అందెల గలగలలో నడిచే కోమలి
కోయిల పాటలతో పిలిచే నా చెలి
నీకిదే స్వాగతం ఎద లోగిలిలోకి
ఎప్పటికీ ఉండిపో.. మది కోవెలలోనే
గుండె దాహంతో ఎదురు చూస్తోంది ఆర్తిగా
వెల్లువలా కదలిరా...వాసంత సమీరంలా

సరోగసీకి సరైన అర్థం చెప్పిన 'పూలకుండీలు'


'కుపచ్చ విధ్వంసం' నవలతో నవలా రచయితగా ఆవిర్భవించిన శిరంశెట్టి కాంతారావు మరో అద్భుత రచన 'పూలకుండీలు'. కవి, కథకుడు, నవలాకారుడుగా అన్ని పార్శ్వాలను స్పృశించిన శిరంశెట్టి... పవిత్రమైన మాతృ గర్భాన్ని కూడా అంగడి సరుకుగా మార్చేసిన ఆధునిక వ్యవస్థ అని చెప్పుకునే అస్తవ్యస్థ వ్యవస్థ వికృతరూపాన్ని 'పూలకుండీలు' నవల ద్వారా బట్టబయలు చేశారు. నిరుపేద అద్దె గర్భపు తల్లుల ఆక్రోశాన్ని అత్యంత హృద్యంగా చిత్రించారు. తొమ్మినెల్ల పేగుబంధపు ప్రతిరూపం ఎలావుందో ఒక్కసారన్నా కళ్లారా చూసుకునే అవకాశం ఇవ్వకుండానే పూలకుండీల నుంచి వేరుచేసిన మొక్కల్లా క్షణాల్లో తల్లీ బిడ్డలను వేరేసి ఎగరేసుకుపోతారంటూ రచయిత తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు. నవలా శీర్షిక కూడా అర్థవంతమైన ఎంపిక. పేదరికాన్ని ఆసరాచేసుకుని కొన్ని ఏజెన్సీలు పేదరాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నాయి. సరోగసీ (అద్దెగర్భం) నేడు మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ విచ్చల విడిగా వేళ్లూనుకుంటోంది. మన దేశంలో 5000 మిలియన్లకు పైగా ఈ వ్యాపారం సాగుతోందని ఒక అంచనా.
పేదరికాన్ని అడ్డుపెట్టుకొని మధ్య దళారీలు, వడ్డీవ్యాపారులు, మైక్రో ఫైనాన్స్‌ వంటి సంస్థలు పేదల రక్తాన్ని పీల్చుతూ.. వాళ్ల జీవితాలను ఎలా ఛిద్రం చేస్తారో కళ్లకు కట్టినట్లు వర్ణించారు రచయిత. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మోసపోతున్న పేదలు సరైన సమయానికి ప్రభుత్వం బిల్లులు చెల్లించక, పూరి గుడిశలతో తెల్లారిపోతున్న తమ

ప్రేమంటే కలిసుండటం కాదు... దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవ్వడం


మూర్తిమత్వం

ప్రతి పనికీ ఓ ఫలితం 
ప్రతి ఫలితానికీ ఓ రూపం
ప్రతి రూపానికీ ఓ వర్ణం 
ప్రతి వర్ణానికీ ఓ స్వరం
ప్రతి స్వరానికీ ఓ గాత్రం
ఆ ఫలితం
ఆ రూపం
ఆ వర్ణం
ఆ స్వరం
ఆ గాత్రం
ఆ అన్నింటి మూర్తిమత్వం
ఓ సజీవ సుందర శిల్పం
కనుల ఎదుట సాక్షాత్కరిస్తే...
ఆ ప్రేమమూర్తి
ఆ అనురాగ దీప్తి
నీవు...నీవు మాత్రమే..
- రాజాబాబు కంచర్ల
02-06-2016

పులకింత


ఏదో తెలియని తుళ్లింత
నీ మనసు తెలిసిన పులకింత
ఎన్నోనాళ్ల వేచిన వలపంతా
పూలజల్లై కురిసెను మనసంతా
మౌనం విచ్చుకున్న పువ్వయితే
ఇంక ఆపతరమా ఆ పరిమళాలు
నిశ్శబ్దం ఝంఝానిలం అయితే
చిరుగాలి వీయదా శరచ్ఛంద్ర వీచికలు
పరవళ్లు తొక్కే సంతోషం
మది విరబూసిన పూదోట పరిమళం
నిశీధి నీరవంలో వెలుగు సంతకం
వినీలాకాశంలో విహరించే ప్రేమపావురాలం
- రాజాబాబు కంచర్ల
21-05-2016

విరిసిన కమలం


హృదయం విరిసిన కమలం
ఉదయం హృదయ కోకిల గీతం
వదనం ప్రకృతి సోయగం
అధరం మది పరవశాల చుంబనం
హృదయమనే అద్దంలో
కనిపించే ప్రతిబింబం నీ రూపం
పూవుల సరాగాలలో
ఊసుల సరిగమల మాధుర్యం నీ స్వరం
శూన్యమైన వేణువులో
ఆమని ఒలికించి పలికిందొక గమకం
అనురాగపు జతలో
పయనించే తోడుగా నిలువనా జీవితాంతం
అధరాలు చిలికే మధురిమలు
అనురాగము లొలికే సరిగమలు
మధువును గొలిపే అందాలు 

నేడు చలం పుట్టినరోజు


నేడు చలం పుట్టినరోజు (19-05-1894)
-------------------------
చలం...
ఒక చలనం.. సంచలనం
ఒక నిర్ణిద్ర సముద్రం
ఒక మహా జలపాతం
ఒక ఝంఝానిలం
చలం...
ఆంధ్ర సాహిత్యంలో ఒక సుడిగాలి
సంఘంలో.. సాహిత్యంలో... ప్రజల ఆలోచనలలో...
తరతరాలుగా పేరుకుపోయిన కల్మషాన్ని కడిగేసిన దీశాలి
కొత్త గాలులకు తలుపులు తెరచి
కొత్త భావాలకు లాకులు ఎత్తిన సవ్యసాచి

‘స్ఫూర్తిశిఖరం’


స్నేహపు బంగారు తీగలతో
బ్రతుకు బంధాలను చుట్టి
అన్యోన్యతా పందిరిపై
అల్లుకున్న తీగలు
లీలా సుందరయ్యలు..
ఆశయాల వెన్నెల్లో
ఆదర్శాల మల్లెల్ని పూచించారు
జీవితమంతా పరిమళించారు
ఒకరికి ఒకరై
అందరి కొరకై
ఆధిపత్యపు జాడల
నీడలేవీ పడకుండా
దంపతులంటే ఎలావుండాలో
నిరూపించారు...
ఆకాశంలో సగాన్ని
అసమానతా అగాధంలోకి
తోయొద్దనీ!
అతివలు జతకాకుండా
ఉద్యమగతి సాగదనీ
తరాలుగా దారుణ పీడన
తరుణులపై సాగుతోంది
ఒకరికి ఇంకొకరు
బానిసగా మారటం
మనసుకు సంకెళ్ళువేసి
మరలాగ మార్చటం
ఆస్తి నిండిన ఇంటిలోకి
ఆమెను కూడా త్రోసి
‘మను’వాడిన నాటకానికి
మనిషితనం నుసిచేసి
సహనంతో భరించమనీ
సహజీవనం సాగించమంటారు వాళ్లు
అది అనాగరిక నేరమంటావు నువ్వు
ఈ ఘోరాన్ని చూస్తూ ఊరుకోననీ
మహిళల పక్షం వహించావు
సమ సమాజాన్ని సాధించాలంటూ
సమతాగుణ నిధివై
మమతల సిరులు పంచావు!
కామ్రేడ్ సుందరయ్యా
సుందర కామ్రేడువయ్యా
----------------------------------------------------
కె.ఆనందాచారి గారు రచించిన
‘స్ఫూర్తిశిఖరం’
మహామనీషి పుచ్చలపల్లి సుందరయ్య
దీర్ఘకావ్యం నుంచి....
సుందరయ్య గారి వర్థంతి సందర్భంగా...
------------------------------------------------------

శ్రీశ్రీ చతురోక్తి

ప్రాసకు, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు.
అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని సృష్టించడంలో ఆయన మేటి.
ఒకసారి ఓ పాఠకుడు ...
‘కమ్యూనిస్టు దేశాలలో సింహానికి, కుక్కకూ తేడా లేదంటారు.
ఇది ఎంతవరకూ నిజం?’’ అని అడిగాడు.
దానికి శ్రీశ్రీ...
‘‘అది సగం వరకూ... నిజం.
అలా అనేవాళ్లనీ కలిపితే మిగతా సగం పూర్తవుతుంది’’ అన్నారు.