12, మార్చి 2016, శనివారం

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో

పల్లవి:

ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...

ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఆ..ఆ... ఆ

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో.. ఆ .. ఆ.. ఆ..
రవి చూడని.. పాడని.. నవ్యనాదానివో...
రవివర్మకే... ఆ .. ఆ..   అందని... ఆ .. ఆ..  ఒకే ఒక అందానివో... 


చరణం 1:


ఏ రాగమో.. తీగదాటి ఒంటిగా నిలిచే

 యొగమో.. నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగభావాలో.. అనురాగ యోగాలై....
ఆ.. ఆ... ఆ.. ఆ... ఆ.. ఆ
నీ పాటలే పాడనీ..

రవివర్మకే... ఆ .. ఆ.. ఆ..  అందని... ఆ .. ఆ.. ఆ..  ఒకే ఒక అందానివో... 


చరణం 2:


ఏ గగనమో కురులు జారి.. నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి.. కుంకుమై పోయే
ఆ కావ్య కల్పన
లే.. నీ దివ్య శిల్పాలై

ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...
కదలాడనీ.. పాడనీ..

రవివర్మకే...  అందని.. ఒకే ఒక అందానివో...

ఆ .. ఆ.. ఆ....

రవి చూడని.. పాడని.. నవ్యనాదానివో...

రవివర్మకే.. ఆ.. ఆ... అందని.. ఆ.. ఆ...
ఒకే ఒక అందానివో...

 

చిత్రం :  రావణుడే రాముడైతే ( 1979)
సంగీతం :  జి.కె. వెంకటేశ్
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి

 

నీ జతగా నేనుండాలి.. నీ ఎదలో నేనిండాలి..


నీ జతగా నేనుండాలి.. నీ ఎదలో నేనిండాలి..
నీ కథగా నేనే మారాలి..
నీ నీడై నేనడవాలి.. నీ నిజమై నేనిలవాలి..
నీ ఊపిరి నేనే కావాలీ..

నాకే తెలియని నను చూపించి.. నీకై పుట్టాననిపించి..
నీదాకా నను రప్పించావే..
నీ సంతోషం నాకందించి.. నా పేరుకి అర్ధం మార్చీ..
నేనంటే నువ్వనిపించావే..

||నీ జతగా||

కల్లోకొస్తావనుకున్నా.. తెల్లార్లూ చూస్తూ కూర్చున్నా..
రాలేదే ?  జాడైనా లేదే ?
రెప్పల బైటే నేనున్నా.. అవి మూస్తే వద్దామనుకున్నా..
పడుకోవే ? పైగా తిడతావే ?
లొకంలో లేనట్టె.. మైకం లో నేనుంటే..
వదిలేస్తావ నన్నిలా..
నీ లోకం నాకంటె.. యింకేందో వుందంటే..
నమ్మే మాటలా

||నీ జతగా||

తెలిసీ తెలియక వాలిందీ..
నీ నడుమొంపుల్లో నలిగిందీ నా చూపూ.. ఏం చేస్తాం చెప్పూ..
తోచని తొందర పుడుతోంది..
తెగ తుంటరిగా నను నెడుతోందీ నీ వైపూ.. నీదే ఆ తప్పూ
నువ్వంటే నువ్వంటూ.. ఏవేవో అనుకుంటూ..
విడిగా ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ.. దూరాన్నే తరిమేస్తూ..
ఒకటవ్వాలిగా

నీ జతగా నేనుండాలి.. నీ ఎదలో నేనిండాలి..
నీ కథగా నేనే మారాలి..
నీ నీడై నేనడవాలి.. నీ నిజమై నేనిలవాలి..
నీ ఊపిరి నేనే కావాలీ..

ఆకాశమా నీవెక్కడ


ఆకాశమా నీవెక్కడ
అవనిపైనున్న నేనెక్కడ
ఏ రెక్కలతో ఎగిసి వచ్చిన
నిలువగలనా నీ పక్కన ||ఏ రెక్కలతో||
ఆకాశమా నీవెక్కడ
అవనిపైనున్న నేనెక్కడ

నీలాల గగనాల ఓ జాబిలి
నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా ||నీలాల||
ముళ్ళున్న రాళ్లున్న నా దారిలో
నీ చల్లని పాదాలు సాగేదెల
నీ మనసన్నది నా మది విన్నది
నిలిచిపోయింది ఒక ప్రశ్నలా
నిలిచిపోయింది ఒక ప్రశ్నలా

ఆకాశమా లేదక్కడ
ఆకాశమా లేదక్కడ
అది నిలిచి ఉంది నీ పక్కన
వేల తారకలు తనలో ఉన్నా
వేల తారకలు తనలో ఉన్నా
నేలపైనే తన మక్కువ ||ఆకాశమా||

వెల లేని నీ మనసు కోవెలలో
నను తలదాచుకోని చిరు వెలుగునై ||వెల లేని||
వెను తిరిగి చూడని నీ నడకలో
నను కడ దాక రాని నీ అడుగునై
మన సహ జీవనం వెలిగించాలిలే
సమతా కాంతులు ప్రతి దిక్కున
సమతా కాంతులు ప్రతి దిక్కున

ఆకాశమా నీవెక్కడ
అది నిలిచి ఉంది నా పక్కన
వేల తారకలు తనలో ఉన్నా
నేలపైనే తన మక్కువ
ఈ నీల పైనే తన మక్కువ

***

చిత్రం: వందేమాతరం
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: C నారాయణ రెడ్డి
గానం: S జానకి, S P బాలసుబ్రమణ్యం