1, మే 2016, ఆదివారం

వాలు కనులదానా…

వాలు కనులదానా…
వాలు కనులదానా 
నీ విలువ చెప్పు మైనా 
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే 
ఓ నోట మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే

వాలు కనులదానా 
నీ విలువ చెప్పు మైనా 
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే 
ఓ మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
 
చెలియా నిన్నే తలచి 
కనులా జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు 
లేకుండ పోయింది 
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి 
ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది
క్షణక్షణం నీ తలపుతో 
తనువు చిక్కి పోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా 
నీకు సాటి ఏది ప్రియతమా
నీ కీర్తి లోకాలు పలక 
ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలక చిలకా..
నీ కీర్తి లోకాలు పలక 
ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలికే 
రోజే నిను నేను చేరుకోనా

వాలు కనులదానా 
నీ విలువ చెప్పు మైనా 
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే 
ఓ నోట మాట రాక..
నోట మాట రాక మూగబోతినే

దైవం నిన్నే మలచి 
తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు 
నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
ఘడియ ఘడియ ఒడిని కరగు 
రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది 
నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన కాలం నాటి 
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా..
జక్కన కాలం నాటి 
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా..
నీ సొగసుకేది సాటి

వాలు కనులదానా…
వాలు కనులదానా 
నీ విలువ చెప్పు మైనా 
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే 
ఓ నోట మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే

చిత్రం : ప్రెమికులరోజు (1999) 
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్ 
సాహిత్యం : ఏ.ఎం.రత్నం, శివగణేష్
గానం : ఉన్నిమీనన్

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో

తెలుసా మనసా


పల్లవి:

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో

చరణం 1:

ప్రతిక్షణం ఊ ఊ ఊ ఊ ఊ నా కళ్ళల్లో నిలిచే నీ రూపం
బ్రతుకులో ఓ ఓ ఓ ఓ అడుగడుగునా నడిపే నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 



darling, every breath you take,
every move you make
 I will be there,
what would I do without you?,
 
I want to love you forever... and ever... and ...ever


చరణం 2:

ఎన్నడూ ఊ ఊ ఊ ఊ ఊ తీరిపోని రుణముగా ఉండిపో
చెలిమితో ఓ ఓ ఓ ఓ తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ...

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో

చిత్రం: క్రిమినల్ (1994)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: బాలు, చిత్ర

ఓ బంగరు రంగుల చిలకా

ఓ బంగరు రంగుల చిలకా


పల్లవి :


ఓ.. బంగరు రంగుల చిలకా.. పలకవే..
ఓ.. అల్లరి చూపుల రాజా..  ఏమనీ..
నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ


ఓ..  అల్లరి చూపుల రాజా.. పలకవా.. 
ఓ..  బంగరు రంగుల చిలకా ఏమనీ ....
నా మీద ప్రేమే ఉందనీ.... నా పైన అలకే లేదనీ


ఓ.. ఓ.. ఓహో..హో..హో.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


చరణం 1 :


పంజరాన్ని దాటుకునీ.. బంధనాలు తెంచుకునీ..నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా..మిద్దెలోని బుల్లెమ్మా..నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో.. నీ చేతులలో.. పులకించేటందుకే ..


ఓ బంగరు రంగుల చిలకా పలకవే..
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ..
నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ


చరణం 2 :


సన్నజాజి తీగుంది..తీగ మీద పువ్వుంది..పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది..జుంటి తేనె కోరింది..అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో..ఈ కోనల్లో.. మనకెదురే లేదులే....


ఓ..  అల్లరి చూపుల రాజా.. పలకవా.. 
ఓ..  బంగరు రంగుల చిలకా ఏమనీ ....
నా మీద ప్రేమే ఉందనీ.... నా పైన అలకే లేదనీ


చిత్రం :  తోట రాముడు (1975)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల

మాటేరాని చిన్నదాని



ఓ పాపలాలి - మాటేరాని చిన్నదాని

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా ..
రేగే మూగ తలపే వలపు పంటరా

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా ..
రేగే మూగ తలపే వలపు పంటరా

వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరిచి ప్రేమలు కొసరెను
చందనాల జల్లు కురిసే చూపులు కలిసెను
చందమమ పట్ట పగలే నింగిని పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కళలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించె ....

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు

ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మెలుకొలుపే నా చెలి పిలుపులు
సందెవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే ...

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా ..
రేగే మూగ తలపే వలపు పంటరా

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా ..
రేగే మూగ తలపే వలపు పంటరా

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో


ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో 
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను 
నా గుండె ఏనాడో చేజారిపోయింది 
నీ నీడగా మారి నా వైపు రానంది 
దూరాన ఉంటూనే ఏ మాయ చేశావో 
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో 
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను 

నడిరేయిలో నీవు..  నిదురైన రానీవు.. 
గడిపేదెలా కాలమూ .. గడిపేదెలా కాలమూ .. 
పగలైన కాసేపు ... పని చేసుకోనీవు... 
నీ మీదనే ధ్యానము .. నీ మీదనే ధ్యానము ..
ఏ వైపు చూస్తున్నా ... నీ రూపే తోచింది... 
నువు కాక వేరేదీ .. కనిపించనంటోంది... 
ఈ ఇంద్రజాలాన్ని .. నీవేనా చేసింది... 

నీ పేరులో ఏదో ... ప్రియమైన కైపుంది.. 
నీ మాట వింటూనే  .. ఏం తోచనీకుంది.. 
నీ మీద ఆశేదో ... నను నిలవనీకుంది.. 
మతి పోయి నేనుంటే... నువు నవ్వుకుంటావు.. 

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో 
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను 

Music: Shashi Preetham
Lyricist: Sirivennela
Singer: Sunitha 
Movie : Gulabi

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే



పల్లవి:

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
ఎందుకో ఏకాంత వేళా చెంతకే రానందీ వేళా
గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల

చరణం 1:

సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా
కంటి పరదా నీ బొమ్మగా కళలొలికేనా
వర్ణమై వచ్చానా వర్ణమై పాడానా
జాణ తెలుగులా జాణ వెలుగులా
వెన్నైలై గిచ్చానా వేకువే తెచ్చానా
పాల మడుగులా పూల జిలుగులా
అన్ని పోలికలు విన్నా వేడుకలో ఉన్నా
నువ్వేమన్నా నీ మాటల్లో నన్నే చూస్తున్నా

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల

చరణం 2:

ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోల
ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల
అంతగా నచ్చానా ఆశలే పెంచానా
గొంతు కలపనా గుండె తడపనా
నిన్నలా వచ్చానా రేపుగా మారానా
ప్రేమ తరఫున గీత చెరపనా
ఎంత దూరాన నీవున్నా నితోనే నే లేనా
నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా


చిత్రం: గోపి గోపిక గోదావరి (2009)
సంగీతం: చక్రి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: చక్రి, కౌసల్యా

నమ్మవేమో గాని అందాల యువరాణి




నమ్మవేమో గాని అందాల యువరాణి
నేలపై వాలింది నా ముందే విరిసింది (2)
అందుకే అమాంతం నా మది అక్కడే నిశబ్దం అయినది
ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది (2)

నవ్వులు వెండిబాణాలై నాటుకుపోతుంటే
చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే
చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే
రూపం ఈడు భారాలై ముందర నిల్చుంటే
ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగా అయ్యాను నేనే
అడిగా పాదముని అడుగువేయమని కదలలేదు తెలుసా
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది (2)

వేకువ లోన ఆకాశం ఆమెను చేరింది
ఓ క్షణమైనా అధరాల రంగుని ఇమ్మంది
వేసవి తాపం చలి వేసి ఆమెను వేడింది
శ్వాసలలోన తల దాచి జాలిగ కూర్చుంది
ఆ అందమంతా నా సొంతమైతే ఆనందమైనా వందేళ్ళు నావే
కలల తాకిడిని మనసు తాలదిక వెతికి చూడు చెలిమి
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
చిత్రం : పరుగు