19, ఏప్రిల్ 2017, బుధవారం

నాటకం బతకాలి

 కావ్యేషు నాటకం రమ్యం!
నాటకాంతం హి సాహిత్యం
నాటకాంతం హి కవిత్వం
- అన్నట్టుగా...
వస్తురూపాన్నీ, భావగంధాన్నీ ఆనందాన్నీ, సామాజిక ప్రయోజనాన్నీ,
సందేశ స్వరూపాన్నీ పాఠక లోకానికీ, ప్రేక్షకులకూ
తెలియజేయడానికి
దృశ్యరూపకమైన సౌలభ్యం వుండటం వల్లనే నాటక ప్రక్రియ లలితకళల సమాహారమైంది.
రచయిత తాను చెప్పవలసిన విషయాన్ని, అందించవలసిన సందేశాన్నీ త్వరితగతిన
సామాజికుల హృదయంలో నాటడానికి, నాటకం అనువైన సాధనం.

30, నవంబర్ 2016, బుధవారం

ఎదలో ఉన్నది ఆలయము

01.
ఎదలో ఉన్నది ఆలయము
అది ఓ దేవత మందిరము
తానులేని నాడదో శిధిలాలయము

మాతృభాషకు పట్టం

తెలుగు భాషకు ప్రాచీన హోదా కిరీటం
ఇది తెలుగు జాతికి మకుటాయమానం
మాతృభాషకు పట్టం కడదాం
కొనఊపిరితో బతుకీడుస్తున్న తేటతెనుగును బతికించుకుందాం
ఇపుడైనా ఏలికలకు కలిగేనా జ్ఞానోదయం
ఇకనైనా వర్థిల్లేనా తెలుగు భాషావికాసం
నిర్మాణాత్మక దిశగా అడుగులు వేద్దాం
దశదిశలా తెలుగు వెలుగులు వ్యాపింపజేద్దాం
***
తెలుగు భాషకు ప్రాచీన హోదాపై దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. 2008 అక్టోబర్ 31న కేంద్ర ప్రభుత్వం అతి
ప్రాచీన భాషల్లో తెలుగును చేర్చింది. అయితే, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా భాషలకు ప్రాచీన హోదా
కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ 2009లో మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కాగా, తెలుగుతోపాటు కన్నడ,
మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా అర్హత ఉందని మద్రాసు హైకోర్టు సోమవారం (08-08-2016) తేల్చి
చెప్పింది. తెలుగును ఆధునిక భాషగా గుర్తించడంతో పాటు ప్రపంచ భాషగా మార్చేందుకు రెండు తెలుగు ప్రభుత్వాలు కృషి
చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
- రాజాబాబు కంచర్ల
08-08-2016

న్యూనతాభావం

మనసులోని భావాలు 
వెల్లువల ఉప్పొంగుతుంటే..
వ్యక్తీకరించడానికి 
అడ్డొస్తున్నదేదో న్యూనతాభావం
ఎవరికోసమే
మనసులోని భావాలను అదిమిపెడితే..
మాటల రూపంలోనో...
అక్షరాల రూపంలోనో బయటకు రావాలి
ఇంకా మిగిలివుంటే
కన్నీరై కారిపోవాలి
అప్పుడే...
బరువు దిగుతుంది
గుండె సేదతీరుతుంది
- రాజాబాబు కంచర్ల
08-08-2016

చైతన్యం నింపే కవితా జ్యోతులు

ఈ కవితా సంపుటిలోని ప్రతి అక్షరం అంబేద్కర్‌ భావజాలపు వెలుగులో చైతన్య కిరణం. ఈ కవితా సంపుటి సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్షలపై సంధించిన అక్షర తూణీరం. దళితుల ఐక్యత, ఆత్మాభిమానం, సామాజిక న్యాయం, రాజ్యాధికారం వంటి అంశాలపై కవి హృదయ స్పందనే ఈ కవితా సంపుటి. రచయిత చింతా అప్పారావు ఆంగ్ల భాషా అధ్యాపకులైనప్పటికీ సరళమైన భాషలో వ్యవస్థలోని లొసుగుల ముసుగుల్ని తొలగించి, వ్యవస్థ స్వరూపాన్ని, ఆయా వర్గాల భావోద్వేగాలను స్పష్టంగా, నిర్మొహమాటంగా వెల్లడించారు. 'చైతన్య జ్యోతులు' అనే

తెలిసిపోయింది

తెలిసిపోయింది ‘హోదా’కి అడ్డెవరో
నిరసనలు తెలిపేవారిని
లాఠీలతో బాదించి
వ్యాన్లలోకి ఈడ్పించి
మహిళల తాళిబొట్టు తెంపించి
కర్కోటకంగా వ్యవహరించి
అభినవ ‘నీరో’నని
మళ్లీ మళ్లీ రుజువు చేసుకొంటున్నదెవరో
తెలిసిపోయింది...
హోదాకు అడ్డెవరో తెలిసింది...
గజదొంగను సంకలో పెట్టుకొని
ఎదుటివారిపై నిందలు మోపి
సిసలైన నీతిమంతుడ్నని గప్పాలు కొట్టి
పచ్చమీడియాతో డబ్బా కొట్టించుకొని
తోకముడిచే బడాబాబుల బండారం
బట్టబయలయింది..
హోదాకు అడ్డెవరో తెలిసిపోయింది...
హోదా సంజీవని కాదు...
సింగపూర్ తరహా రాజధానులు
కజకిస్తాన్ తరహా భవంతులు
జపాన్ తరహా నిరసనలు
ఇక ఆంధ్రుల సంస్కృతికి కాలంచెల్లు
ఇవే బాబుగారి గీతోపదేశాలు
అందరికీ తేటతెల్లం అయింది
హోదాకు అడ్డెవరో తెలిసిపోయింది
ప్రత్యేక హోదా మన హక్కు
ఆంధ్రుడా చెయ్యి చెయ్యి కలుపు
దూసుకొంటూ..తోసుకొంటూ...
మన హక్కును నినదిస్తూ..
జగన్నాథ రథచక్రాలై
పోదాం...పోదాం.. మునుముందుకు...
- రాజాబాబు కంచర్ల
03-08-2016

ఎద లోగిలి

ఎద లోగిలిలో తీర్చిదిద్దిన రంగవల్లివీవు
కను దోయలలో దాగున్న స్వప్నికవీవు
మది ఊహలలో విరిసిన రంగుల హరివిల్లువీవు
అణువణువునా ప్రవహించే ప్రేమధార నీవు
హృది లోయలలో దాగిన భావాలను రగిలిగించిన చైతన్యమీవు
నేస్తమై మనసు దోచిన సౌందర్యవల్లివీవు
నీవులేని నేను...
శృతితప్పిన పల్లవిని
మూగబోయిన గేయాన్ని
రంగు వెలసిన చిత్రాన్ని
అర్థంలేని పద్యాన్ని
దేవతలేని నిలయాన్ని
శిథిలమైన ఆలయాన్ని
- రాజాబాబు కంచర్ల
31-07-2016